Share News

సబ్‌ప్లాన్‌ నిధులు పక్కదారి పట్టించిన జగన్‌

ABN , Publish Date - Sep 05 , 2024 | 12:29 AM

ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌, ఎస్సీ కార్పొరేషన్‌ నిదులును అప్పటి సీఎం జగన్‌ పక్కదారి పట్టించారని మాజీ మంత్రి మారెప్ప ఆరోపించారు.

సబ్‌ప్లాన్‌ నిధులు పక్కదారి పట్టించిన జగన్‌
మాట్లాడుతున్న మారెప్ప

వైసీపీ పాలనలో దళితులకు రక్షణ కరువు : మాజీ మంత్రి మారెప్ప

పత్తికొండ టౌన్‌, సెప్టెంబరు 4: ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌, ఎస్సీ కార్పొరేషన్‌ నిదులును అప్పటి సీఎం జగన్‌ పక్కదారి పట్టించారని మాజీ మంత్రి మారెప్ప ఆరోపించారు. బుధవా రం పత్తికొండకు వచ్చిన ఆయన టీడీపీ ఎస్సీ సెల్‌ నాయకులు సందోలి ముత్యాల తిరుపాలు స్వగృహంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జగన్‌ ఉద్దరిస్తారనీ పాలనను కట్టబెడితే.. ఐదేళ్లలో ప్రజలకు నరకయాతన చూపారన్నారు. వైసీపీ పాలనలో దళితులకు రక్షణ లేకుండా పోయిందన్నారు. ఎన్టీఆర్‌ మాదిగలను రాజకీయంగా ప్రోత్సహించారనీ గుర్తు చేశారు. సీఎం చంద్రబాబు పరిపాలన సవ్యంగా ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. వర్గీకరణ అమలైతే ఉద్యోగ, రాజకీయ రిజర్వేషన్‌లో న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. టీడీపీ ఎస్సీ సెల్‌ రాష్ట్ర నాయకులు తిరుపాలు, సుధాకర్‌, మహిళ సంఘం నాయకురాలు శాంతి పాల్గొన్నారు.

Updated Date - Sep 05 , 2024 | 12:29 AM