Share News

ఎడతెరపిలేని వాన

ABN , Publish Date - Oct 21 , 2024 | 12:03 AM

వర్షం వెంటాడుత్నుది. పది రోజులుగా కురుస్తున్న వానలు ఖరీఫ్‌లో సాగు చేసిన వేరుశనగ, ఉల్లి, పత్తి, మొక్కజొన్న, ఆము దం, వరి పంటలను ముంచెత్తుతున్నాయి.

ఎడతెరపిలేని వాన

కన్నీరు మున్నీరవుతున్న రైతులు

కర్నూలు అగ్రికల్చర్‌ అక్టోబరు 20, (ఆంధ్రజ్యోతి): వర్షం వెంటాడుత్నుది. పది రోజులుగా కురుస్తున్న వానలు ఖరీఫ్‌లో సాగు చేసిన వేరుశనగ, ఉల్లి, పత్తి, మొక్కజొన్న, ఆము దం, వరి పంటలను ముంచెత్తుతున్నాయి. ఉమ్మడి కర్నూలు జిల్లాలో దాదాపు 6 లక్షల హెక్టార్లలో ఖరీఫ్‌ పంటలు సాగయ్యాయి. చేతికొ చ్చిన మొక్కజొన్న, వరి, పత్తి, వేరుశనగ పంటలను కాపాడుకోవడానికి రైతులు అష్టకష్టాలు పడుతు న్నారు. నంద్యాల జిల్లాలో పెరికేసిన మొక్క జొన్నలను ఆరబెట్టేందుకు రైతులు పడుతున్న బాధలు అన్నీ ఇన్నీ కావు. గత వైసీపీ ప్రభుత్వం టార్పాలిన్లను రైతులకు సబ్సిడీకి ఇవ్వడం మీద ఏ మాత్రం దృష్టి పెట్టలేదు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వమైనా రైతులకు సత్వరమే టార్పాలిన్లు అందించే కార్యక్రమాన్ని చేపట్టాలని రైతులు కోరుతున్నారు. అయితే ప్రతిపాదనలు ప్రభుత్వా నికి పంపించామని, నిధులు విడుదల కాగానే టార్పాలిన్లు రైతులకు సప్లయ్‌ చేస్తామని వ్యవసా య శాఖ జేడీ వరలక్ష్మి తెలిపారు. కాగా, రోజూ వర్షం పడుతుండటంతో ఉల్లిగడ్డలను పొలంలోంచి పీకి మార్కెట్‌ యార్డుకు తరలించడానికి రైతులు ఇబ్బందిపడుతున్నారు. మిర్చి పంటకు తెగుళ్లు సోకుతున్నాయి. వరి పంటలో గింజలు నేలరాలు తున్నాయి. పత్తి రైతుల బాధలు వర్ణనాతీతం. వరితో పాటు పత్తి, మిర్చి తదితర పంటలకు అధిక వర్షాల వల్ల తెగుళ్లు వ్యాపిస్తున్నాయి. ఎర్రతె గుళ్ల కారణంగా మిర్చి పంటను రైతులు ట్రాక్టర్లతో దున్నేసి ప్రత్యామ్నాయ పంటలు వేసేందుకు సిద్ధమవుతున్నారు.

Updated Date - Oct 21 , 2024 | 12:03 AM