ప్రతి బెడ్‌కు వెంటిలేటర్ ఉండాల్సిందే
ABN , Publish Date - Nov 30 , 2024 | 12:21 AM
ఆర్‌ఐసీయూ, ఏఎంసీ వార్డుల్లో ప్రతి బెడ్‌కు వెంటిలేటర్ తప్పనిసరిగా ఉండాలని కర్నూలు జీజీహెచ సూపరింటెండెంట్ డాక్టర్ కే వెంకటేశ్వర్లు ఆదేశిం చారు.
కర్నూలు జీజీహెచ సూపరింటెండెంట్ కే వెంకటేశ్వర్లు
కర్నూలు హాస్పిటల్, నవంబరు 29(ఆంధ్రజ్యోతి): ఆర్‌ఐసీయూ, ఏఎంసీ వార్డుల్లో ప్రతి బెడ్‌కు వెంటిలేటర్ తప్పనిసరిగా ఉండాలని కర్నూలు జీజీహెచ సూపరింటెండెంట్ డాక్టర్ కే వెంకటేశ్వర్లు ఆదేశిం చారు. శుక్రవారం ఆసుపత్రిలో ఆయన సీఎస్‌ఆర్‌ఎంవో డాక్టర్ బీవీ రావు, డిప్యూటీ సీఎస్‌ఆర్‌ఎంవో డాక్టర్ బి. హేమనళినితో కలిసి గ్రాండ్ రౌండ్స్ నిర్వహించారు. అత్యవసర విభాగాల్లో వెంటిలేటర్లు, సెక్షన ఆప రేటర్లు అన్ని వసతులు ఉండేలా చూసుకోవాలని బయో మెడికల్ ఇంజ నీర్‌ను ఆదేశించారు. డైట్ విభాగంలో డాక్టర్ల రిజిస్టర్‌ను పరిశీలించి ఏయే డాక్టర్లు వస్తున్నారు.. వారి వివరాలను అడిగి తెలుసుకున్నారు. రిజిస్టర్‌లో ఆహారం తీసుకున్న వైద్యులందరినీ తనిఖీ చేసి సంతకాలు తీసుకోవాలని డైటీషియన రామాంజనేయులును ఆదేశించారు. ఆసుపత్రి లో సెక్యూరిటీ సిబ్బంది సంఖ్యను పెంచాలని ఏజెన్సీని ఆదేశించారు.