ఆస్పత్రికి విరాళంగా పరికరాలు
ABN , Publish Date - Oct 02 , 2024 | 12:21 AM
కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశా లలో అమెరికాలోని చికాగోలో నివసించే 1962, 1963 బ్యాచకు చెందిన కేఎంసీ పూర్వ విద్యార్థులు డాక్టర్ కృష్ణారెడ్డి అరుణ దంపతులు రూ.30 లక్షల విలువగల పరికరాలను ఆసుపత్రికి విరాళంగా ఇచ్చారు.
కర్నూలు(హాస్పిటల్), అక్టోబరు 1: కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశా లలో అమెరికాలోని చికాగోలో నివసించే 1962, 1963 బ్యాచకు చెందిన కేఎంసీ పూర్వ విద్యార్థులు డాక్టర్ కృష్ణారెడ్డి అరుణ దంపతులు రూ.30 లక్షల విలువగల పరికరాలను ఆసుపత్రికి విరాళంగా ఇచ్చారు. అందులో భాగంగా రూ.4.5 లక్షలతో ఈఎనటీ విభాగానికి ఎండోస్కోప్ యూనిట్‌ను శుక్రవారం అందజేశారు. మంగళవారం గైనిక్ విభాగంలో బీటీ-350 సిటీజీ మానిటర్స్, రెండు, ఒక ఆపరేషన ఓటీ టేబుల్స్‌ను గైనిక్ హెచవోడీ డాక్టర్ శ్రీలక్ష్మికి ఆసుపత్రి సూపరింటెండెంట్ అందజేశారు.
త్వరలో ఇనఫెర్టిలిటీ విభాగం : సంతానలేమి (ఇనఫెర్టిలిటీ విభాగాన్ని) కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి గైనిక్ విభాగంలో త్వరలో ప్రారంభిస్తున్నట్లు సూపరింటెండెంట్ ప్రకటించారు. ఇటీవల కాలంలో పెళ్లి చేసుకున్న తర్వాత సంతానం కలగకపోవడం సమస్యగా మారిందన్నారు. బయట ఖర్చు ఎక్కువ గా ఉండటంతో నిరుపేద దంపతులు ఇనఫెర్టిలిటీ వైద్యం కష్టంగా మారడంతో కర్నూలు జీజీహెచలోనే సంతానలేమి విభాగాన్ని ఏర్పాటు చేయాలని, ఈ సేవలు త్వరలో ప్రారంభిస్తామన్నారు. గైనిక్ విభాగం హెచవోడీ డాక్టర్ శీలక్ష్మి, ప్రొఫెసర్లు సావిత్రి, శ్రీలత, డిప్యూటీ సీఎస్‌ఆర్‌ఎంవో హేమనళిని, ఏఆర్‌ఎంవో వెంకటరమణ, అనస్థీషియా అసోసియేట్ ప్రొఫెసర్ మురళీ ప్రభాకర్ పాల్గొన్నారు.