Share News

సీసీఐ పత్తి కొనుగోళ్లకు శ్రీకారం

ABN , Publish Date - Oct 02 , 2024 | 12:19 AM

కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ) జిల్లాలో పత్తి కొనుగోళ్లకు శ్రీకారం చుట్టనుంది.

సీసీఐ పత్తి కొనుగోళ్లకు శ్రీకారం
ఆదోని సీసీఐ కార్యాలయం

ఆదోని (అగ్రికల్చర్‌), అక్టోబరు 1 : కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ) జిల్లాలో పత్తి కొనుగోళ్లకు శ్రీకారం చుట్టనుంది. గత 15 రోజులుగా పత్తి ధరలు పతనమవుతుండడంతో ప్రభుత్వం రైతులకు గిట్టుబాటు ధర అందించాలన్న ఉద్దేశంతో సీసీఐని రంగంలోకి దించింది. కేంద్ర ప్రభుత్వం పత్తికి ప్రకటించిన మద్దతు ధర ప్రకారం క్వింటాలు రూ.7521కు కొనుగోలు చేయనుంది. దసరా నాటికి ఆదోని, ఎమ్మిగనూరు, మంత్రాలయం, పెంచికలపాడు కేంద్రాల్లో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించనున్నట్లు ఆదోని మార్కెట్‌ యార్డు కార్యదర్శి రామ్మోహన్‌ రెడ్డి తెలిపారు. రైతులు గ్రామాల్లోనే రైతు సేవా కేంద్రాల్లో తమ పేర్లను నమోదు చేసుకోవాల్సి ఉంటుందన్నారు. పత్తిని నేరుగా కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చి విక్రయించుకోవచ్చని సూచించారు. రైతులు తేమ లేకుండా ఆరబెట్టుకొని విక్రయానికి తీసుకు రావాలన్నారు. దీనిపై రైతులకు అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. సీసీఐలో విక్రయించుకున్న రైతులకు వారం రోజుల్లోపు రైతుల ఖాతాల్లో నేరుగా డబ్బులు జమ చేస్తారన్నారు. ప్రస్తుతం మార్కెట్‌లో మద్దతు ధర కంటే రూ.150కి పైగా అధికంగా వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారన్నారు. సీసీఐకి విక్రయించుకునే రైతులు పత్తిని విక్రయించుకోవచ్చని పేర్కొన్నారు.

Updated Date - Oct 02 , 2024 | 12:19 AM