టీనేజీలో జాగ్రత్తగా ఉండాలి : డీఎస్పీ
ABN , Publish Date - Oct 22 , 2024 | 01:43 AM
టీనేజీ వయ స్సులో విద్యార్థినులు జాగ్రత్తలు పాటించాలని పత్తికొండ డీఎస్పీ వెంకట్రామయ్య సూచించారు.
పత్తికొండ టౌన్, అక్టోబరు 21, (ఆంధ్రజ్యోతి): టీనేజీ వయ స్సులో విద్యార్థినులు జాగ్రత్తలు పాటించాలని పత్తికొండ డీఎస్పీ వెంకట్రామయ్య సూచించారు. సోమవారం పభుత్వ బాలికల ఉన్న త పాఠశాలలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ కార్యదర్శి శ్రీనివాసు లు ఆధ్వర్యంలో పోలీసు అమరవీరుల దినోత్సవం నిర్వహించారు. పోటీలు నిర్వహించి, విజేతలకు బహుమతులు అందజేశారు. హెచ్‌ఎం భ్రమరాంబ, ట్రైనీ డీఎస్పీ ఉషశ్రీ, సీఐ జయన్న, అరసం జిల్లా కార్యదర్శి సత్యనారాయణ పాల్గొన్నారు.