Share News

గంగమ్మ ఒడికి...

ABN , Publish Date - Sep 12 , 2024 | 12:18 AM

అయిదు రోజులపాటు పూజలు అందుకున్న గణనాధుడు గంగమ్మ ఒడికి చేరారు. బుధవారం ఆదోని శివార్లలోని హరివాణం తుంగభద్ర దిగువ కాలువలో భక్తులు నిమజ్జనం చేశారు. మాజీ ఎమ్మెల్యే మీనాక్షినాయుడు, ఎంపీ బస్తిపాటి నాగరాజు, జనసేన ఇనచార్జి మల్లప్ప పూజలు చేశారు. వినాయక మిత్ర మండలి సభ్యులు ఎగ్గాటి ప్రతాప్‌, కునిగిరి నీలకంఠ, విట్టా రమేష్‌, శ్రీకాంత రెడ్డి, నాగరాజు గౌడ్‌, శ్రీనివాసాచారి, దేవిశెట్టి ప్రకాష్‌తో కలిసి ఎమ్మెల్యే డా. పార్థసారథి, మున్సిపల్‌ ఛైర్‌ పర్సన బోయ శాంత, గుడిసె కృష్ణమ్మ, మాజీ మార్కెట్‌ యార్డు చైర్మన మాన్వి దేవేంద్రప్ప పాల్గొన్నారు. లడ్డూను వేలం వేయగా రూ.1.75 లక్షకు మహేంద్ర రెడ్డి దక్కించుకున్నారు.

గంగమ్మ ఒడికి...
తొలి గణపయ్యను నిమజ్జనం చేస్తున్న భక్తులు

ఆదోని/ఆదోని(అగ్రికల్చర్‌), సెప్టెంబరు 11: అయిదు రోజులపాటు పూజలు అందుకున్న గణనాధుడు గంగమ్మ ఒడికి చేరారు. బుధవారం ఆదోని శివార్లలోని హరివాణం తుంగభద్ర దిగువ కాలువలో భక్తులు నిమజ్జనం చేశారు. మాజీ ఎమ్మెల్యే మీనాక్షినాయుడు, ఎంపీ బస్తిపాటి నాగరాజు, జనసేన ఇనచార్జి మల్లప్ప పూజలు చేశారు. వినాయక మిత్ర మండలి సభ్యులు ఎగ్గాటి ప్రతాప్‌, కునిగిరి నీలకంఠ, విట్టా రమేష్‌, శ్రీకాంత రెడ్డి, నాగరాజు గౌడ్‌, శ్రీనివాసాచారి, దేవిశెట్టి ప్రకాష్‌తో కలిసి ఎమ్మెల్యే డా. పార్థసారథి, మున్సిపల్‌ ఛైర్‌ పర్సన బోయ శాంత, గుడిసె కృష్ణమ్మ, మాజీ మార్కెట్‌ యార్డు చైర్మన మాన్వి దేవేంద్రప్ప పాల్గొన్నారు. లడ్డూను వేలం వేయగా రూ.1.75 లక్షకు మహేంద్ర రెడ్డి దక్కించుకున్నారు. వినాయక మండపం వద్ద హుండీని రూ.2.10 లక్షలకు డా.విజయ్‌ దక్కించుకున్నారు.

సాయంత్రం నాలుగు గంటలకు ప్రారంభమైన శోభాయాత్ర

బుధవారం సాయంత్రం 4 గంటల నుంచి నిమజ్జనానికి తరలించారు. అధిక శాతం చీకటి పడ్డాక విగ్రహాలను వాహనాల ద్వారా నిర్వాహకులు డీజేలతో తరలించారు. రాత్రి 10 గంటలకు సగంకూడా పూర్తికాలేదు.

కోసిగిలో నిమజ్జన వేడుకలు

కోసిగి, సెప్టెంబరు 11: మండల కేంద్రంలో బుధవారం వినాయక నిమజ్జన వేడుకలు నిర్వహించారు. బుధవారం సాయంత్రం మాధవరం వద్ద గల తుంగభద్ర నదిలో నిమజ్జనం చేశారు. కోసిగయ్య గుడిలో గణేషునికి ప్రత్యేక పూజలు చేసి లడ్డూ ప్రసాదాల వేలాలు నిర్వహించారు. వినాయక మండపాల నిర్వహకులు, అర్చకులు శ్రీరాములు, హనుమేష్‌, ఈరన్న, హనుమంతు, కర్రయ్య, మల్లికార్జున పూజలు చేశారు. మహారాష్ట్ర కళాకారులచేత నృత్యప్రదర్శ నలు, డప్పు, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఎస్‌ఐ చంద్రమోహన బందోబస్తు నిర్వహించారు.

మంత్రాలయం: మండలంలోని తుంగభద్ర, కాచాపురం, రాంపురం గ్రామాల్లో బుధవారం సాయంత్రం వినాయక నిమజ్జనం చేశారు. ఎస్‌ఐ విజయకుమార్‌ బందోబస్తు నిర్వహించారు.

Updated Date - Sep 12 , 2024 | 12:18 AM