Share News

కార్యకర్తలకు అన్యాయం జరిగితే సహించం

ABN , Publish Date - Oct 31 , 2024 | 01:46 AM

టీడీపీ కార్యక ర్తలకు అన్యాయం జరిగితే సహించేది లేదని ఆ పార్టీ కార్యని ర్వాహక కార్యదర్శి, నియోజకవర్గ పరిశీలకుడు కనపర్తి శ్రీనివాస రావు అన్నారు.

కార్యకర్తలకు అన్యాయం జరిగితే సహించం

టీడీపీ నియోజకవర్గ పరిశీలకుడు కె.శ్రీనివాసరావు

అవనిగడ్డ, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి): టీడీపీ కార్యక ర్తలకు అన్యాయం జరిగితే సహించేది లేదని ఆ పార్టీ కార్యని ర్వాహక కార్యదర్శి, నియోజకవర్గ పరిశీలకుడు కనపర్తి శ్రీనివాస రావు అన్నారు. బుధవారం కోడూరు మండల విస్తృతస్థాయి సమావేశం కోడూరు వంతెన సెంటర్‌లో పార్టీ మండల అధ్య క్షుడు బండే శ్రీనివాసరావు అధ్యక్షతన నిర్వహించారు. ముఖ్య అతిథులుగా కనపర్తి శ్రీనివాసరావు, పార్టీ జిల్లా అధికార ప్రతి నిధి కొల్లూరి వెంకటేశ్వరరావు విచ్చేశారు. రెవెన్యూ, పోలీసు, ఇతర కార్యాలయాల్లో టీడీపీ నాయకులు, కార్యకర్తలకు అన్యా యం జరిగినా ఐదేళ్లలో తప్పుడు కేసులు బనాయించి రౌడీషీట్లు తెరిచినా వాటి వివరాలు వెంటనే తమకు తెలియజేయాలని, పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని తెలిపారు. కోడూరు-అవనిగడ్డ ప్రధాన రహదారి నిర్మాణం ఇంతవరకు పూర్తి కాలేదని, మండలంలో 4వేల ఎకరాలు ముంపునకు గురై రైతులు ఇబ్బందులు పడుతున్నారని, వారికి ప్రభుత్వం నుంచి నష్టపరిహారం ఇప్పించాలని, ముంపునకు ప్రధాన కారణమైన అవుట్‌ఫాల్‌ స్లూయిస్‌లు నిర్మించేలా చూడాలని కనపర్తిని బండే శ్రీనివాసరావు కోరారు. కోడూరు ఒకటో వార్డులో డ్రెయి నేజీ సమస్యపై పలువురు మహిళలు కనపర్తి శ్రీనివాసరావుకు వినతిపత్రం అందజేశారు. టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Oct 31 , 2024 | 06:51 AM