వరద బాధితులను ఆదుకుంటాం
ABN , Publish Date - Sep 12 , 2024 | 12:45 AM
వరద బాధితులను ప్రభుత్వం ఆదుకుం టుందని గ్రామస్థులకు ఎమ్మెల్యే మండలి బుద్దప్రసాద్ హామీ ఇచ్చారు.
ముంపు బారిన పడిన లంక గ్రామాల్లో సీసీ రోడ్లు నిర్మిస్తాం: ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్
నాగాయలంక, సెప్టెంబరు 11: వరద బాధితులను ప్రభుత్వం ఆదుకుం టుందని గ్రామస్థులకు ఎమ్మెల్యే మండలి బుద్దప్రసాద్ హామీ ఇచ్చారు. బుధ వారం నాగాయలంక చిన్నకరకట్ట కింద కోతకు గురైన మత్స్యకార భవనం ప్లాట్ ఫామ్‌ను ఆయన పరిశీలించారు. ముంపు బారిన పడిన గృహాలను సందర్శించి, ప్రజలను ప్రరామర్శించారు. కూటమి నేతలు పాల్గొన్నారు.
కూలిన ఇళ్ల స్థానంలో పక్కా గృహాల నిర్మాణానికి కృషి
చల్లపల్లి: వరద ముంపు బారిన పడిన నియోజకవర్గంలోని ఐదు లంక గ్రామాల్లో రూ.ఐదు కోట్లతో సీసీ రోడ్లు నిర్మిస్తామని ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్ హామీ ఇచ్చారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. వరద బారిన పడిన లంక గ్రామాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టితో అభివృద్ధి చేస్తోందని తెలిపారు. లంక గ్రామాల్లో వాణిజ్య పంటలకు జరిగిన నష్టాన్ని పూర్తిస్థాయిలో నమోదు చేసి రైతాంగాన్ని ఉదా రంగా ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. కూలిన ఇళ్ల స్థానంలో పక్కా గృహాల నిర్మా ణానికి కృషి చేస్తామన్నారు. జరిగిన అపారనష్టాన్ని దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం భారీగా సహాయాన్ని అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
కరకట్ట ఎత్తు పెంచాలి
కృష్ణా కరకట్టను పటిష్టపరచాల్సిన అవసరం ఉందని మండలి బుద్ధప్రసాద్ అభిప్రాయపడ్డారు. 11 లక్షల క్యూసెక్కుల వరకు వరదను తట్టుకునేలా కరకట్ట నిర్మాణం జరిగిందని, కానీ అంతకంటే ఎక్కు వ వచ్చినా తట్టుకునేలా కరకట్టను పటిష్టపరిచి ఎత్తుపెంచాలని ఆయన పేర్కొన్నారు.
తడిసిన 400 క్వింటాళ్ల పసుపు
మోపిదేవి: కృష్ణానది వరదల కారణంగా బొబ్బర్లంక గ్రామం పూర్తిగా జలమయమైంది. గత ఏడాది సాగుచేసి పండించిన పసుపు పంటకు తగిన గిట్టుబాటు ధర లేకపోవటంతో గ్రామంలోని గోడౌన్లలో నిల్వ చేశారు. వరదల్లో గ్రామానికి చెందిన బలరామకృష్ణ 8 ఎకరాల్లో పండించిన 400 క్వింటాళ్ల పసుపు వరదల కారణంగా తడిసింది. వరదల అనంతరం రెండు రోజులుగా ఎండలు వేయడంతో రహదారులు, ఖాళీ ప్రదేశాల్లో ఆరబెట్టి కూలీలతో ఎండబెట్టిస్తున్నారు. 17 ఎకరాల్లో ఈ ఏడాది సాగు చేసిన పంట మరికొద్ది రోజుల్లో చేతికి అందివస్తున్న తరుణంలో వరదల కారణంగా పంట నీటి ముంపునకు గురైందని తెలిపారు.