Share News

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించండి

ABN , Publish Date - Nov 30 , 2024 | 12:40 AM

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని గ్రామ, వార్డు సచివాలయ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామిని ఏపీ ఎన్జీవో అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కేవీ శివారెడ్డి, సీహెచ్‌ పురుషోత్తమనాయుడు కోరారు.

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించండి
మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామికి వినతిపత్రం అందజేస్తున్న ఏపీఎన్జీవో రాష్ట్ర నాయకులు

వన్‌టౌన్‌, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి): గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని గ్రామ, వార్డు సచివాలయ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామిని ఏపీ ఎన్జీవో అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కేవీ శివారెడ్డి, సీహెచ్‌ పురుషోత్తమనాయుడు కోరారు. శుక్రవారం మంత్రిని సచివాలయంలోని చాంబర్‌లో అసోసియేషన్‌ నాయకులు కలిశారు. ‘గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు కామన్‌ అపాయింట్‌మెంట్‌ డేట్‌ ఇవ్వాలి. మెరిట్‌ కమ్‌ రోస్టర్‌ విధానంలో సీనియారిటీ లిస్టులు తయారు చేయాలి. జూనియర్‌ అసిస్టెంట్‌ పేస్కేల్‌ మంజూరు చేయాలి. డేట్‌ ఆఫ్‌ జాయినింగ్‌ నుంచి ఇంక్రిమెంట్లు ఇవ్వాలి. పదోన్నతులు కల్పించి ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఖాళీల్లో సచివాలయ ఉద్యోగులకు అవకాశమివ్వాలి. పింఛన్ల పంపిణీలో ఉద్యోగులపై ఒత్తిడి లేకుండా చూడాలి.’ అని వినతిపత్రాన్ని మంత్రికి అందజేశారు. పశ్చిమ కృష్ణాజిల్లా అధ్యక్షుడు ఎ.విద్యాసాగర్‌, రాష్ట్ర ఉపాధ్యక్షుడు డి.వి.రమణ, కోశాధికారి రంగారావు, గ్రామ, వార్డు సచివాలయ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఎండీ జానీబాషా పాల్గొన్నారు.

Updated Date - Nov 30 , 2024 | 12:40 AM