స్వచ్ఛంద సంస్థల సేవలు అభినందనీయం: ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్
ABN , Publish Date - Sep 16 , 2024 | 01:03 AM
వరద బాధితులకు స్వచ్ఛంద సంస్థలు అందిస్తున్న సేవలు అభినందనీయమని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పేర్కొన్నారు.
పటమట: వరద బాధితులకు స్వచ్ఛంద సంస్థలు అందిస్తున్న సేవలు అభినందనీయమని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పేర్కొన్నారు. 12వ డివిజన్ లోని సంజయ్ గాంధీనగర్ కాలనీలో వరద బాధితులకు దాతలు శ్రీనివా సరెడ్డి, వసుంధర డైమండ్స్ అందించిన 600 దుప్పట్లు, లుంగీలు, చీరలను జడ్పీ మాజీ చైర్‌పర్సన్ అనురాధతో కలిసి ఆయన వరద బాధితులకు అందజేశారు. పొట్లూరి సాయిబాబు, శాయన సత్యనారాయణ, ఏకాంబరం, కాకరమెట్ల నారాయణ, కె. లక్ష్మిప్రసాద్, కె.రవి, రాజేశ్వరి పాల్గొన్నారు.
500 నిత్యావసరాల కిట్ల పంపిణీ
మొగల్రాజపురం: 8వ డివిజన్ ఇస్రాయిల్‌పేటలో వరద ముంపు బాధితులకు రౌండ్ టేబుల్ ఇండియా, లేడీస్ సర్కిల్ ఇండియా అనుబంధ సంఘాలైన రౌండ్ టేబుల్ 68, విజయవాడ లేడీస్ సర్కిల్ 52, అమరావతి రౌండ్ టేబుల్ 282, అమరావతి లేడీస్ సర్కిల్ 206 సంస్థల ప్రతినిదులు 500 నిత్యావసరాల కిట్లను అందించారు. ఈ కార్యక్రమాన్ని టీడీపీ యువ నాయకుడు గద్దె క్రాంతికుమార్ ప్రారంభించారు. కార్పొరేటర్ చెన్నుపాటి ఉషా రాణి, డాక్టర్ గుత్తికొండ శ్రీహర్ష, యండూరి అశ్విన్, డాక్టర్ ఆదిత్య నాదెళ్ల, జాస్తి లక్ష్మిపతి, మన్హర్ సేతీ, అలేఖ్య, సమీక్ష పాల్గొన్నారు.