రక్తదాతలకు సత్కారం
ABN , Publish Date - Oct 02 , 2024 | 12:53 AM
రక్తదానం మానవత్వానికి ప్రతీక అని రక్తదానం చేస్తే మరోకరి ప్రాణం కాపాడిన వారవుతారని లయన్స్ క్లబ్ అధ్యక్షుడు నేరెళ్ల తేజ అన్నారు. జాతీయ స్వచ్ఛంద రక్తదాతల దినోత్సవం పురస్కరిం చుకుని సుధీర్ టింబర్‌డిపో కాన్ఫ్‌రెన్స్ హాల్‌లో మంగళ వారం రక్త దాతల అభినందన సత్కార కార్యక్రమం నిర్వహించారు.
ఉయ్యూరు, అక్టోబరు 1 : రక్తదానం మానవత్వానికి ప్రతీక అని రక్తదానం చేస్తే మరోకరి ప్రాణం కాపాడిన వారవుతారని లయన్స్ క్లబ్ అధ్యక్షుడు నేరెళ్ల తేజ అన్నారు. జాతీయ స్వచ్ఛంద రక్తదాతల దినోత్సవం పురస్కరిం చుకుని సుధీర్ టింబర్‌డిపో కాన్ఫ్‌రెన్స్ హాల్‌లో మంగళ వారం రక్త దాతల అభినందన సత్కార కార్యక్రమం నిర్వహించారు. క్లబ్ జిల్లా క్యాబినెట్ డిప్యూటీ సెక్రటరీ నూకల వెంకట సాంబశివరావు, జోన్ చైర్‌పర్సన్ ఎండి ఇస్మాయిల్ పాల్గొన్నాని పలుమార్లు స్వచ్ఛందంగా రక్తదానం చేసి, రక్తదానాన్ని ప్రోత్సహించిన కె.శృతి, పామర్తి వెంకటతరుణ్‌కుమార్, శిరిగినీడి నిఖిల్ సంజయ్‌ను ఘనంగా సత్కరించారు. క్లబ్ కార్యదర్శి రాంబాబు, ట్రెజరర్ దినవహి ప్రసాద్, ప్రతినిధులు నల్లా శ్రీనివాస్, వూర కిషోర్‌కుమార్ తదితరులు పాల్గొని రక్తదాన దాతలకు అభినందనలు తెలిపారు.