Share News

Nimmala: పోలవరంపై పీపీఏ సమాధానం వైసీపీకి చెంపదెబ్బ

ABN , Publish Date - Nov 29 , 2024 | 04:21 PM

Andhrapradesh: పోలవరం ఎత్తు తగ్గించేస్తున్నారంటూ వైసీపీ విష ప్రచారానికి, మొసలి కన్నీటికి సమాచార హక్కు చట్టం ద్వారా పీపీఏ ఇచ్చిన సమాధానం వైసీపీకి చెంపదెబ్బ అని మంత్రి నిమ్మల అన్నారు. పోలవరం చరిత్రలో 41.15 మీటర్లు అంటూ ఫేజ్-1 కు బీజం పడింది, వేసింది, వైసీపీ ప్రభుత్వమే అని చెప్పుకొచ్చారు. 45.72 మీటర్ల కు కాకుండా 41.15 మీటర్ల ఎత్తుకే నీళ్లు నింపడం అనే ప్రతిపాదన 2021లో జగన్ ప్రభుత్వమే కేంద్రానికి ప్రతిపాదన పంపిందని పీపీఏ కుండబద్దలు కొట్టిందన్నారు.

Nimmala: పోలవరంపై పీపీఏ సమాధానం వైసీపీకి చెంపదెబ్బ
Minister Nimmala Ramanaidu

అమరావతి, నవంబర్ 29: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత జగన్ (Former CM YS Jaganmohan Reddy) అవినీతి అసత్యాలకు పుట్టిన దినపత్రిక సాక్షి ప్రతినిత్యం పోలవరం పై విషం చిమ్ముతోందని మంత్రి నిమ్మల రామానాయుడు (Minister Nimmala Ramanaidu) ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. 2014-2019 తెలుగు దేశం ప్రభుత్వ పాలనలో ఫేజ్ -1, ఫేజ్ -2, అని గానీ, ఎత్తు తగ్గింపు అని గానీ ఉంటే సాక్ష్యం చూపాలని సవాలు విసిరితే మండలిలో వైసీపీ సభ్యులు తోక ముడిచారంటూ వ్యాఖ్యలు చేశారు.

నామాటే లెక్కచేయరా.. ఆ అధికారులకు పవన్ మాస్ వార్నింగ్


నేడు పోలవరం ఎత్తు తగ్గించేస్తున్నారంటూ వైసీపీ విష ప్రచారానికి, మొసలి కన్నీటికి సమాచార హక్కు చట్టం ద్వారా పీపీఏ ఇచ్చిన సమాధానం వైసీపీకి చెంపదెబ్బ అని అన్నారు. పోలవరం చరిత్రలో 41.15 మీటర్లు అంటూ ఫేజ్-1 కు బీజం పడింది, వేసింది, వైసీపీ ప్రభుత్వమే అని చెప్పుకొచ్చారు. 45.72 మీటర్ల కు కాకుండా 41.15 మీటర్ల ఎత్తుకే నీళ్లు నింపడం అనే ప్రతిపాదన 2021లో జగన్ ప్రభుత్వమే కేంద్రానికి ప్రతిపాదన పంపిందని పీపీఏ కుండబద్దలు కొట్టిందన్నారు. ప్రధాన డ్యామ్‌లో 41.15 మీటర్ల ఎత్తుకు నీటి నిల్వ పరిమితం చేయాలనే నిర్ణయం ప్రతిపాదన తీసుకున్నది జగన్ ప్రభుత్వమే అని పీపీఏ తేల్చి చెప్పిందన్నారు.

సెన్సెక్స్ 750 పాయింట్లు జంప్..


ఎత్తు తగ్గింపు, ఫేజ్ 1,ఫేజ్-2 ల విభజన , డయాఫ్రమ్ వాల్ విధ్వంసం అన్ని జగన్ అరాచకపాలన లోపాలే అని అన్నారు. అబద్ధాన్ని 100 సార్లు చెప్పినా నిజం కాదు అన్న సత్యాన్ని జగన్ గ్రహించాలని హితవుపలికారు. ఆంధ్రుల జీవనాడి రాష్ట్ర ఆర్ధిక సంపద పెరుగుదలకు ఆధార బిందువు పోలవరం ప్రాజెక్ట్ అని వెల్లడదించారు. తమ నాయకుడు చంద్రబాబు ఆలోచన నదుల అనుసంధానం ప్రక్రియకు అసలు పునాది పోలవరం ప్రాజెక్ట్ అని అన్నారు. ‘‘ప్రాజెక్ట్ 45.72 మీటర్ల ఎత్తుకు నిర్మాణం విషయంలో మా విధానం , మా ఆలోచన, మా చిత్తశుద్ధి వజ్రతుల్యం’’ అని పేర్కొన్నారు. కేంద్రం రాష్ట్రంలో ఉన్నది ఎన్డీయే డబుల్ ఇంజన్ సర్కార్ అని అన్నారు. చంద్రబాబు సారథ్యంలో పోలవరం పూర్తి చేస్తామని... గోదావరి జలాలు అటు ఉత్తరాంధ్ర, ఇటు రాయల సీమ ప్రాంతాలకు తీసుకొస్తామని మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు.


ఇవి కూడా చదవండి...

సచివాలయ ఉద్యోగుల సంఘం నేత వెంకట్రామి రెడ్డి అరెస్టు

AP News: సత్యసాయి జిల్లాలో విషాదం..

Read Latest AP News And Telugu News

Updated Date - Nov 29 , 2024 | 04:28 PM