Share News

Kollu Ravindra: చంద్రబాబు విజన్ 2020 అంటే నవ్వారు.. కానీ

ABN , Publish Date - Nov 29 , 2024 | 03:03 PM

Andhrapradesh: భవిష్యత్తు తరాలను దృష్టిలో ఉంచుకుని కూటమి ప్రభుత్వం పాలన సాగుతోందని మంత్రి కొల్లురవీంద్ర అన్నారు. గత ఐదేళ్లల్లో రాష్ట్రం వదిలిన వారు ఇప్పుడు మళ్లీ ఏపీ‌ వైపు చూస్తున్నారని తెలిపారు. ప్రభుత్వపరంగా పరిశ్రమలు ఏర్పాటుకు ప్రోత్సహకాలు ఇస్తుందన్నారు. ప్రతి ఒక్కరూ ఈ అవకాశం ఉపయోగించు కోవాలని కోరారు.

Kollu Ravindra: చంద్రబాబు విజన్ 2020 అంటే  నవ్వారు.. కానీ
Minister Kollu Ravindra

విజయవాడ, నవంబర్ 29: రాష్ట్ర ప్రభుత్వం ఆలోచనకు అనుగుణంగా ఏపీ ఛాంబర్ ఈ బిజినెస్ ఎక్స్‌పో ఏర్పాటు చేయడం‌ అభినందనీయం అని మంత్రి కొల్లు రవీంద్ర (Minister Kollu Ravindra) అన్నారు. శుక్రవారం ఏపీ ఛాంబర్ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా బిజినెస్ ఎక్స్‌పో‌ను మంత్రులు కొండపల్లి శ్రీనివాస్, కొల్లు రవీంద్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ.. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు ఉన్న అవకాశాలను ఎక్స్ పోలో వివరిస్తున్నారన్నారు.

Harish: ఒక్కనాడైనా జై తెలంగాణ అన్నావా.. రేవంత్‌‌పై హరీష్ విసుర్లు


పారిశ్రామికవేత్తగా ఎదగాలంటే అనువైన మార్గాలు ఇక్కడ తెలుసుకోవచ్చన్నారు. మనకి తీర ప్రాంతంలో ఎంతో సంపద ఉందని... దాని పై దృష్టి పెట్టకపోవడం వల్ల నష్ట పోయామని తెలిపారు. విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబు వచ్చాక నేడు ఏపీ రూపు రేఖలు మారుతున్నాయన్నారు. గతంలో చంద్రబాబు విజన్ 2020 అంటే నవ్వారని.. కానీ ఇప్పుడు హైదరాబాద్‌ను ‌చూస్తే చంద్రబాబు దూరదృష్టి అందరికీ అర్ధమైందన్నారు. విభజన తరువాత బస్సులో ఉండి ‌పాలన చేశారని.. ఎన్నో పరిశ్రమలను ఏపీకి తీసుకువచ్చారని తెలిపారు.


గత ప్రభుత్వం నిర్వాకం వల్ల అన్నీ వెనక్కిపోయాయని మండిపడ్డారు. ఇప్పుడు విజన్ 2047 అని చంద్రబాబు ప్రకటించారని.. భవిష్యత్తు తరాలను దృష్టిలో ఉంచుకుని కూటమి ప్రభుత్వం పాలన సాగుతోందన్నారు. గత ఐదేళ్లల్లో రాష్ట్రం వదిలిన వారు ఇప్పుడు మళ్లీ ఏపీ‌ వైపు చూస్తున్నారని తెలిపారు. ప్రభుత్వపరంగా పరిశ్రమలు ఏర్పాటుకు ప్రోత్సహకాలు ఇస్తుందన్నారు. ప్రతి ఒక్కరూ ఈ అవకాశం ఉపయోగించు కోవాలని కోరారు. ఇటువంటి ఎక్స్ పోలకు వచ్చి ఉన్న అవకాశాలు తెలుసుకోవాలన్నారు. రాష్ట్రంలో పరిశ్రమలు ఏర్పాటు కూడా ఎంతో అవసరమన్నారు. ఎక్కడకి వెళ్లినా మన తెలుగు వాళ్లు సత్తా చాటుతున్నారన్నారు. మచిలీపట్నంలో పోర్ట్ నిర్మాణం జరుగుతోందని.. అక్కడ కూడా పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు రావాలని కోరారు. లక్ష్యాలను నిర్ధేశించుకుని పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు.


రండి.. మీ కలలను నిజం చేసుకోండి: మంత్రి శ్రీనివాస్

ఏపీ ఛాంబర్ బిజినెస్ ఎక్స్ పో అందరికీ ఉపయోగకరంగా ఉందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. 160 మంది ఎగ్జిబిటర్స్ ఈ ఎగ్జిబిషన్ లో‌పాల్గొన్నారని తెలిపారు. గత ఐదేళ్లల్లో పరిశ్రమ రంగాన్ని పట్టించుకోలేదని.. ఉన్న పరిశ్రమలు కూడా తరలి పోయేలా భయపెట్టారని మండిపడ్డారు. ఉద్యోగ, ఉపాధి‌ అవకాశాలు లేకుండా చేశారన్నారు. ప్రతిభ ఉన్న యువత ... పొట్ట చేత పట్టుకుని అవకాశాల‌ కోసం తరలివెళ్లారన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక పరిశ్రమల ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి పెట్టిందని చెప్పారు. సీఎం చంద్రబాబు స్వయంగా అనేక మంది పారిశ్రామికవేత్తలతో మాట్లాడారని.. పరిశ్రమలు, పెట్టుబడులు పెట్టాలని ఏపీకి ఆహ్వానించారన్నారు. చిన్న తరహా పరిశ్రమలకు‌ ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందన్నారు. ప్రతి ఇంటి నుంచి ఒకరు పారిశ్రామికవేత్తగా మారాలనేది చంద్రబాబు ఆకాంక్ష అని చెప్పుకొచ్చారు. రతన్ టాటా ఎలా ఎదిగారన్నది నేటి యువత తెలుసుకోవాలన్నారు.


కొత్త కొత్తగా అవకాశాలకు సాంకేతికత జోడిస్తే రాణించవచ్చన్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల తరహాలో అనేక చిన్న పరిశ్రమల ఏర్పాటుకు బ్యాంకులు రుణాలు ఇస్తున్నాయన్నారు. ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈ కింద ప్రభుత్వం అన్ని విధాలా సహకారం అందిస్తుందని స్పష్టం చేశారు. చేతి వృత్తుల ఉత్పత్తులు, మైక్రో ఇండస్ట్రీస్‌కు మార్కెటింగ్ అవసరమన్నారు. ఏపీలో తప్పకుండా పరిశ్రమలు ఏర్పాటు అవుతాయని.. లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వస్తాయన్నారు. ప్రభుత్వం అన్ని విధాలా సహకారం అందిస్తుందని వెల్లడించారు. ‘‘కొత్తగా పరిశ్రమలు ఏర్పాటు చేసే వారు లక్ష్యాలతో ముందుకు రండి... మీ ‌కలలను నిజం చేసుకోండి. ఇటువంటి బిజినెస్ ఎక్స్ పో ద్వారా మరింత అవగాహన పెంచుకోండి. ప్రభుత్వం అమలు చేస్తున్న పాలసీలు, విధివిధానాల గురించి తెలుసుకోండి. ప్రతి ఇంటి నుంచి ఒక‌రు పారిశ్రామికవేత్తగా ఎదగాలి’’ అని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆకాంక్షించారు. కాగా.. మూడు రోజుల పాటు జరిగే ఎక్స్ పోలో 150 అంశాల‌పై అవగాహన కల్పించనున్నారు. పరిశ్రమలు ఏర్పాటు, ప్రభుత్వం సహకారం, ఉన్న అవకాశాలు పై తొమ్మిది సెమినార్లు నిర్వహించనున్నారు.


ఇవి కూడా చదవండి...

సచివాలయ ఉద్యోగుల సంఘం నేత వెంకట్రామి రెడ్డి అరెస్టు

AP News: సత్యసాయి జిల్లాలో విషాదం..

Read Latest AP News And Telugu News

Updated Date - Nov 29 , 2024 | 03:03 PM