Share News

మచిలీపట్నం-రేపల్లె రైలుమార్గం నిర్మాణం చేసి తీరుతాం

ABN , Publish Date - Oct 02 , 2024 | 12:55 AM

మచిలీపట్నం-రేపల్లె రైలుమార్గం నిర్మాణానికి తొలిఅడుగు పడిందని మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి తెలిపారు. మచిలీపట్నంలోని ఆర్‌అండ్‌బీ అతిథిగృహంలో మంగళవారం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కోస్తాతీరం వెంబడి రెండు రైల్వేలైన్‌ మార్గాలకు కేంద్రప్రభుత్వం అనుమతులిచ్చిందని తెలిపారు.

మచిలీపట్నం-రేపల్లె   రైలుమార్గం నిర్మాణం చేసి తీరుతాం
మీడియా సమావేశంలో మాట్లాడుతున్న ఎంపీ బాలశౌరి

మచిలీపట్నం, అక్టోబరు 1 (ఆంధ్రజ్యోతి) : మచిలీపట్నం-రేపల్లె రైలుమార్గం నిర్మాణానికి తొలిఅడుగు పడిందని మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి తెలిపారు. మచిలీపట్నంలోని ఆర్‌అండ్‌బీ అతిథిగృహంలో మంగళవారం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కోస్తాతీరం వెంబడి రెండు రైల్వేలైన్‌ మార్గాలకు కేంద్రప్రభుత్వం అనుమతులిచ్చిందని తెలిపారు. మచిలీపట్నం-రేపల్లె రైల్వేలైన్‌ మార్గం దివిసీమ, మచిలీపట్నం ప్రజల చిరకాల వాంఛగా ఉందన్నారు. ఈ ప్రాంత ప్రజలు కోరుకున్న విధంగా మచిలీపట్నం-రేపల్లె రైలుమార్గం నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం అంగీకరించిందన్నారు. ఇపుడున్న నిబంధనల ప్రకారం ఈ రైల్వేలైన్‌ సర్వేకు అనుమతులు వచ్చాయన్నారు. నిర్మాణానికి డీపీఆర్‌ తయారవుతోందన్నారు. రానున్న కేంద్ర బడ్జెట్‌లో నిధులు కేటాయించేలా కృషిచేస్తానని తెలిపారు. ఈ మార్గం ఏర్పడితే హౌరా-చెన్నైల మధ్య 70కిలోమీటర్ల దూరం తగ్గ్గుతుందన్నారు. ప్రయాణికులకు ప్రయాణ సమయం తగ్గడంతోపాటు, సరుకుల రవాణా తక్కువఖర్చుతో చేయడానికి అవకాశం ఏర్పడుతుందన్నారు. మచిలీపట్నం-రేపల్లె రైల్వేలైన్‌ను బాపట్ల వరకు కలిపితే నేరుగా చైన్నై వెళ్లేందుకు అవకాశం ఉంటుందని కేంద్రమంత్రి వైష్టవ్‌కు రైల్వే అధికారులకు తెలియజేయడం జరిగిందన్నారు. నరసాపురంనుంచి మచిలీపట్నం వరకు నూతన రైల్వేలైన్‌ పెడన నియోజకవర్గంలోని మాట్లాం, పల్లెపాలెం, బంటుమిల్లిమీదుగా మచిలీపట్నం నియోజకవర్గంలోని చిలకలపూడి, మచిలీపట్నం వరకు రైల్వేలైన్‌ నిర్మాణానికి సర్వే జరుగుతోందన్నారు.

Updated Date - Oct 02 , 2024 | 12:55 AM