హడలెత్తిస్తున్న గ్రామసింహాలు!
ABN , Publish Date - Oct 21 , 2024 | 01:03 AM
మండల పరిధిలోని ప్రధాన రహదారులపై వీధి కుక్కల బెడద రోజు రోజుకు తీవ్రం అవుతోంది. కుక్కలు దాడులు చేస్తుండటంతో పలువురు గాయా లపాలై ఆసుపత్రుల పాలవుతున్నారు. రహదారుల వెంట వెళ్లే ప్రజలు, మూగజీవాలు, పశువులుపైకి కుక్కలు పరుగులు తీసి దాడులు చేస్తున్నాయి.
(కంకిపాడు - ఆంధ్రజ్యోతి)
మండల పరిధిలోని ప్రధాన రహదారులపై వీధి కుక్కల బెడద రోజు రోజుకు తీవ్రం అవుతోంది. కుక్కలు దాడులు చేస్తుండటంతో పలువురు గాయా లపాలై ఆసుపత్రుల పాలవుతున్నారు. రహదారుల వెంట వెళ్లే ప్రజలు, మూగజీవాలు, పశువులుపైకి కుక్కలు పరుగులు తీసి దాడులు చేస్తున్నాయి. ద్విచక్ర వాహనాలపై వెళ్లే వారి వెంట కుక్కలు వెంబడిస్తుండటంతో వారు ప్రమాదాల బారినపడు తున్నారు. మండలంలోని కొన్ని గ్రామాల్లో తెల్లవారు జామున కొందరు వాకింగ్‌కు, స్కూల్స్, పనులకు వెళ్లే వారు కుక్కల బారిన పడి గాయాలపాలవుతున్నారు. మండలం కేంద్రమైన కంకిపాడు, ఉప్పలూరు, ఈడుపుగల్లు, మద్దూరు, నెప్పల్లి, ప్రొద్దుటూరు పంచాయతీల్లో వీధి కుక్కల బెడద ఎక్కువగా ఉంది. అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.