ఉచితంగా బైక్ మరమ్మతులు
ABN , Publish Date - Sep 16 , 2024 | 01:04 AM
నవ్యాంధ్ర టూ వీలర్ మెకానిక్స్ వెల్ఫేర్ అసోసి యేషన్ ఆధ్వర్యంలో సేవ్ విజయవాడ పేరుతో సిం గ్‌నగర్ గంగానమ్మ గుడి సెంటర్‌లో ఉచిత బైక్ రిపేర్ కార్యక్రమాన్ని నిర్వహించారు.
వన్‌టౌన్, సెప్టెంబరు 15: నవ్యాంధ్ర టూ వీలర్ మెకానిక్స్ వెల్ఫేర్ అసోసి యేషన్ ఆధ్వర్యంలో సేవ్ విజయవాడ పేరుతో సిం గ్‌నగర్ గంగానమ్మ గుడి సెంటర్‌లో ఉచిత బైక్ రిపేర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. అసోసియే షన్ ఆధ్వర్యంలో జగ్గయ్య పేట నుంచి 15 మంది మెకానిక్‌లను రప్పించి ద్విచక్ర వాహనాలకు మరమ్మతులు చేయించారు. వరదలకు పాడైపోయిన వాహనాలతో పెద్ద సంఖ్యలో వాహన యజమానులు తరలివచ్చారు. విజయవాడలో వరద బాధితులకు సాయం చేయాలని 15 మంది మెకానిక్‌లను జగ్గయ్యపేట నుంచి తీసుకొచ్చా మని, రాష్ట్ర నాయకుడు సుభానీ పిలుపు మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిం చామని జగ్గయ్యపేట మెకానిక్‌ల సంఘం అధ్యక్షుడు గొల్లపూడి ముక్కు టేశ్వరరావు తెలిపారు.