వలంటీర్ల ప్రత్యక్ష ప్రచారం
ABN , Publish Date - Apr 03 , 2024 | 01:13 AM
రాజీనామా చేసిన వలంటీర్లు మంగళవారం రాత్రి మచిలీపట్నంలోని 25వ డివిజన్‌లో ప్రత్యక్షంగా ఎన్నికల ప్రచారంలోకి దిగారు. ఉల్లింగిపాలెంలో వలంటీర్లు ఇంటింటికీ పర్యటించారు.
అడ్డుకున్న టీడీపీ
పోలీస్‌స్టేషన్‌కు చేరిన పంచాయితీ
మచిలీపట్నం టౌన్, ఏప్రిల్ 2 : రాజీనామా చేసిన వలంటీర్లు మంగళవారం రాత్రి మచిలీపట్నంలోని 25వ డివిజన్‌లో ప్రత్యక్షంగా ఎన్నికల ప్రచారంలోకి దిగారు. ఉల్లింగిపాలెంలో వలంటీర్లు ఇంటింటికీ పర్యటించారు. వలంటీర్లతో ఇళ్ల వద్దకు వచ్చి పెన్షన్లు ఇవ్వకుండా టీడీపీ నాయకులు అడ్డుపడ్డారని చెప్పడం ప్రారంభించారు. ఇది తెలిసిన టీడీపీ కార్యకర్తలు ఉల్లింగిపాలెంలో వలంటీర్ల వద్దకు వెళ్లారు. ఎన్నికల కమిషన్ వలంటీర్లను పెన్షన్లు పంచవద్దని ఆదేశాలు ఇచ్చిందని, ఎన్నికల కమిషన్‌కు సిటిజన్ ఫర్ డెమొక్రసీ ఫిర్యాదు చేసిందని, టీడీపీ కాదని అన్నారు. రాజీనామా చేయని వలంటీర్లు కూడా ఇంటింటికీ తిరగడంతో టీడీపీ నాయకులు ప్రశ్నించారు. ఇంతలో మాజీ మేయర్ మోకా వెంకటేశ్వరమ్మ అక్కడికి వచ్చారు. అనంతరం వాగ్వివాదం పెరిగి ఇరువర్గాలు పోలీసుస్టేషన్‌కు వెళ్లాయి.