ఆర్టీసీ సెంట్రల్ డిస్పెన్సరీలో రక్తదాన శిబిరం
ABN , Publish Date - Feb 13 , 2024 | 12:49 AM
ఈ ఏడాది జనవరి 15 నుంచి ప్రారంభమైన రహదారి భద్రతా మాసోత్సవాన్ని పురస్కరించుకుని పండిట్ నెహ్రూ బస్టేషన్‌లోని ఆర్టీసీ సెంట్రల్ డిస్సెన్సరీలో సోమవారం రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు.
రక్తదాతలను పరామర్శిస్తున్న
ఎంవై దానం
ఆర్టీసీ సెంట్రల్ డిస్పెన్సరీలో రక్తదాన శిబిరం
బస్టేషన్, ఫిబ్రవరి 12: ఈ ఏడాది జనవరి 15 నుంచి ప్రారంభమైన రహదారి భద్రతా మాసోత్సవాన్ని పురస్కరించుకుని పండిట్ నెహ్రూ బస్టేషన్‌లోని ఆర్టీసీ సెంట్రల్ డిస్సెన్సరీలో సోమవారం రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. జిల్లా రెడ్‌క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని జిల్లా ప్రజారవాణా అధికారి ఎంవై దానం ప్రారంభించారు. అనంతరం శిబిరంలో రక్తదాతలను ఆయన పరామర్శించి అభినందించారు. జిల్లాకు చెందిన 51 మంది ఉద్యోగులు రక్తదానం చేశారు. రెడ్ క్రాస్ సొసైటీ డాక్టర్ టీవీ రామారావు, డీసీఎం ఏ జాన్‌సుధాకర్, డీసీటీఎం బషీర్ అహ్మద్, ఉద్యోగ సంఘాల నాయకులు ప్రతినిధులు పాల్గొన్నారు.
ఫ రహదారి భధ్రత మాసోత్సవాలను పురస్కరించుకుని సోమవారం తుళ్లూరు జిల్లా పరిషత్ హైస్కూల్‌లో సోమవారం విద్యార్థులకు వ్యాసరచన, క్విజ్, వక్తృత్వ పోటీలు నిర్వహించారు. గవర్నరుపేట-2 డిపో మేనేజర్ ఎస్ నాగభూషణం విజేతలకు బహుమతులు అందజేశారు.