అర్హులందరికీ సంక్షేమ ఫలాలు
ABN , Publish Date - Oct 02 , 2024 | 12:49 AM
ఎన్ని కల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి కూట మి ప్రభుత్వం కట్టుబడి ఉందని అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందించే దిశగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే యార్లగడ్డ వెంక ట్రావు అన్నారు. మంగళవారం బాపులపాడు గ్రామంలో నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్లు పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
హనుమాన్‌జంక్షన్, అక్టోబరు 1 : ఎన్ని కల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి కూట మి ప్రభుత్వం కట్టుబడి ఉందని అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందించే దిశగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే యార్లగడ్డ వెంక ట్రావు అన్నారు. మంగళవారం బాపులపాడు గ్రామంలో నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్లు పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఎంజీ నగర్, తారక రామానగర్, హనుమాన్‌నగర్ కాలనీల్లో పలువురు లబ్ధిదారులకు పింఛన్లు అందజే శారు. ఈ కార్యక్రమంలో దుట్టా శివ న్నారా యణ, మూల్పూరి సాయికల్యాణి, వీరమాచ నేని సత్యప్రసాద్, ఆళ్ల గోపాలకృష్ణ్ణ, వేగిరెడ్డి పాపారావు, అట్లూరి శ్రీనివాసరావు, గార్లపాటి రాజేశ్వరరావు, చింతల అప్పారావు, బేతాళ ప్రమీళ రాణి, చలమలశెట్టి రమేష్ బాబు, వడ్డి నాగేశ్వరరావు, తోట మురళీధర్ తదితరులు పాల్గొన్నారు.
ఫ అనారోగ్యం కారణంగా విశ్రాంతి తీసు కుంటున్న టీడీపీ మండల అధ్యక్షుడు దయా ల రాజేశ్వరరావును మంగళవారం యార్లగడ్డ వెంకట్రావు పరామర్శించారు. అనంతరం ఇటీవల మృతి చెందిన సీనియర్ డాక్టర్ గోగినేని భాస్కరరావు కుటుంబ సభ్యులను పరామర్శించారు.
పెద్దలు మన జాతి సంపద..
గన్నవరం : పిల్లలు తమ తల్లిదండ్రు లను వృద్ధాప్యంలో దగ్గర ఉండి చూసుకు న్నప్పుడే సమాజం అభివృద్ధి చెందినట్లు అని ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. పిల్లల కోసం డబ్బులు సంపాదించి, వారిని అమెరికా పంపి ఇక్కడ ఇబ్బందులు పడటం చూస్తుంటే బాధేస్తుందన్నారు. మండలంలోని చినఅవుటపల్లి పుణ్యచారిటీస్ వృద్ధాశ్రమం, సీనియర్ సిటీజన్స్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ప్రపంచ వృద్ధుల దినోత్సవం మంగళవారం చారిటీస్ కార్యదర్శి జాస్తి విజ య భూషణ్‌కుమార్ అధ్యక్షతన జరిగింది. సీనియర్ సిటీజన్స్ నెక్కంటి నాగేశ్వరరావు, వీరమాచినేని భవానిప్రసాద్, రావి నరసింహా రావు, అట్లూరి ప్రేమ్‌చంద్, కారుమూరి రా జేంద్ర ప్రసాద్‌లను దుశ్శాలువాలతో సత్క రించారు. పెద్ద అవుటపల్లి జోసఫ్ తంబి ఆవ రణలోని వృద్ధాశ్రమానికి దుప్పట్లు పంపిణీ చేశారు. మాజీ ఎమ్మెల్యే డాక్టర్ దాసరి వెం కట బాలవర్ధనరావు, పీవీ సత్యనా రాయణ, వి.కామరాజు, మోత్కూరి వెంకటేశ్వరరావు, ఆళ్ల గోపాలకృష్ణ, గన్నే వెంకట్రావు, ఆవుటపల్లి మోహనరావు, కేఎస్ జగదీశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.