అపార్ట్‌మెంట్ పైనుంచి పడి కార్మికుడు దుర్మరణం
ABN , Publish Date - Sep 12 , 2024 | 12:44 AM
ఉయ్యూరులో ప్రధాన సెంటర్ సమీపాన అపార్ట్‌మెంట్ పనిచేస్తూ ప్రమాదవ శాత్తు కిందపడి కార్మికుడు బుధవారం మృతి చెందాడు.
ఉయ్యూరు, సెప్టెంబరు 11 : ఉయ్యూరులో ప్రధాన సెంటర్ సమీపాన అపార్ట్‌మెంట్ పనిచేస్తూ ప్రమాదవ శాత్తు కిందపడి కార్మికుడు బుధవారం మృతి చెందాడు. పట్టణ పోలీసుల వివరాల ప్రకారం.. తోట్లవల్లూరు మండల గరికప ర్రు కు చెందిన బండి సుబ్బారావు(57) లింగమూర్తి సెంట్రల్ అపార్ట్‌మెం ట్‌లో పనిచేసేందుకు వ చ్చి తాడుక టి ్టన బల్లపై కూర్చుని అపార్‌మెంట్ వెలుపల గోడలపై పెరుగుతున్న మొ క్కలు తొలగిస్తూ జారి కిందపడి అక్కడి కక్కడే మృతి చెం దాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సుబ్బా రావు మృతదే హాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ వైద్య శాలకు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.