Share News

వ్యతిరేకమా.. అనుకూలమా?

ABN , Publish Date - Oct 02 , 2024 | 01:00 AM

విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణకు అనుకూలమా? వ్యతిరేకమా? ప్రకటించాలని సీఎం చంద్రబాబును విద్యార్థి యువజన సంఘాల నేతలు ప్రశ్నించారు.

వ్యతిరేకమా.. అనుకూలమా?
దీక్షా శిబిరంలో మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు, జేఏసీ నాయకులు

ధర్నాచౌక్‌, అక్టోబరు 1: విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణకు అనుకూలమా? వ్యతిరేకమా? ప్రకటించాలని సీఎం చంద్రబాబును విద్యార్థి యువజన సంఘాల నేతలు ప్రశ్నించారు. విశాఖ ఉక్కును సెయిల్‌కు అప్పగించడాన్ని నిరసిస్తూ ధర్నాచౌక్‌లో విద్యార్థి, యువజన సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో మంగళవారం ధర్నా నిర్వహించారు. ఏఐవైఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు పరుచూరి రాజేంద్రబాబు, ఏఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.శివారెడ్డి, ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ప్రసన్నకుమార్‌, ఆశోక్‌, డీవైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు రాము, రామన్న, పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు భూషణం తదితరులు మాట్లాడారు. అనేక పోరాటాలు, 32 మంది ప్రాణత్యాగాలతో ఏర్పాటైన విశాఖ ఉక్కును ప్రైవేటీక రించడం ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని దెబ్బతియ్యడమేన న్నారు. ఆ ఆలోచనను కేంద్ర విరమించుకోవాలని డిమాండ్‌ చేశారు. పరిశ్రమకు విశాఖ ఉక్కుకు ఐరన్‌ గనులు కేటాయించకపోవడం సిగ్గుచేటన్నారు. పరిశ్రమను ప్రైవేటీకరిస్తే రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థల బంద్‌తోపాటు, మంత్రుల ఇళ్లు ముట్టడిస్తామన్నారు. దీక్షకు మద్దతు పలికిన మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు, ఏఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడ రావులపల్లి రవీంద్రనాథ్‌, సీపీఐ, సీపీఎం ఎన్టీఆర్‌ జిల్లా కార్యదర్శులు దోనేపూడి శంకర్‌, డి.వి.కృష్ణ, సీఐటీయూ నేత ఉమామహేశ్వరరావు, రైతు సంఘం నేత కేశవరావు మాట్లాడుతూ ఎన్నికలకు ముందు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మాట్లాడిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ పట్టువిడుపులు అని మాట్లాడటం తగదన్నారు.

Updated Date - Oct 02 , 2024 | 01:00 AM