సాంకేతిక శిక్షణతో ప్రమాదాల నిరవారణ సాధ్యం
ABN , Publish Date - Oct 02 , 2024 | 01:07 AM
డ్రైవర్లకు శాస్త్రీయంగా సాంకేతికతో కూడిన శిక్షణఇస్తే ప్రమాదాలను నివారించి క్షేమంగా గమ్యంస్థానాలు చేర్చుతారని డిప్యూటీ పోలీస్ కమిషనర్(ట్రాఫిక్) ఎం.కృష్ణమూర్తినాయుడు అన్నారు.
హనుమాన్‌జంక్షన్‌రూరల్, అక్టోబరు 1 : డ్రైవర్లకు శాస్త్రీయంగా సాంకేతికతో కూడిన శిక్షణఇస్తే ప్రమాదాలను నివారించి క్షేమంగా గమ్యంస్థానాలు చేర్చుతారని డిప్యూటీ పోలీస్ కమిషనర్(ట్రాఫిక్) ఎం.కృష్ణమూర్తినాయుడు అన్నారు. అంపాపురంలోని దికృష్ణా డిస్ట్రిక్ట్ లారీ ఓనర్స్ మోడల్ డ్రైవింగ్ ఇన్‌స్టిట్యూట్ అండ్ రీసెర్స్ సెంటర్‌లో హెవీ వెహికల్ డ్రైవింగ్‌లో శిక్షణ పూర్తి చేసుకున్న 1075వ బ్యాచ్ ట్రైనీలకు మంగళవారం ఆయన సర్టిఫికెట్లు అందజేశారు. సంఘ అధ్యక్షుడు నాగుమోతు రాజా అధ్యక్షతన జరిగిన సభలో కృష్ణమూర్తినాయకడు మాట్లాడుతూ రహదారులపై హెవీ వెహికల్ ప్రమాదాల్లో అత్యధిక భాగం మితిమీరిన వేగం, నిద్రలేమి, అజాగ్రత్తలే కారణమన్నారు. రహదారి భధ్రతాసూచనలు పాటిస్తూ తగు జాగ్రత్తతో వాహనాన్ని నడపాలన్నారు. దికృష్ణా డిస్ట్రిక్ట్ లారీ ఓనర్స్ మోడల్ డ్రైవింగ్ ఇనిస్టిట్యూట్ తరుపున కృష్ణమూర్తినాయుడును సత్కరించారు. కార్యక్రమంలో లారీ ఓనర్స్ సంఘ ప్రధాన కార్యదర్శి వై. వి. ఈశ్వరరావు, లారీ ఓనర్స్ సొసైటీ అధ్యక్షుడు కోనేరు వెంకట రమేష్, లారీ ఓనర్స్ ఫౌండేషన్ అధ్యక్షుడు రావి గోపాలరావు, ఉపాధ్యక్షులు కె.వి.ఎస్. చలపతిరావు, కె. సత్యనారాయణరాజు, ప్రధాన కార్యదర్శి అల్లాడ సత్యనారాయణ, కార్యదర్శి రావి శరత్‌బాబు పాల్గొన్నారు.