జిల్లాలో 139 మద్యం దుకాణాలు
ABN , Publish Date - Oct 01 , 2024 | 11:36 PM
నూతన మద్యం పాలసీ అమలులో భాగంగా జిల్లాలో 139 మద్యం దుకాణాలు ఏర్పాటు కానున్నాయని, షాపుల నిర్వహణకోసం ఆసక్తిగలవారు ఈ నెల 9వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ లోతేటి శివశంకర్ తెలిపారు.
9 వరకు దరఖాస్తుల స్వీకరణ
మరిన్ని వివరాలకు 08562-246344ను సంప్రదించాలి
కలెక్టర్ లోతేటి శివశంకర్
కడప(కలెక్టరేట్), అక్టోబరు 1: నూతన మద్యం పాలసీ అమలులో భాగంగా జిల్లాలో 139 మద్యం దుకాణాలు ఏర్పాటు కానున్నాయని, షాపుల నిర్వహణకోసం ఆసక్తిగలవారు ఈ నెల 9వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ లోతేటి శివశంకర్ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్‌లోని వీడియోకాన్ఫరెన్స్ హాలులో ఎక్సైజ్ అధికారులతో కలసి కలెక్టర్ పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ నూతన మద్యం పాలసీకి సంబంధించి ప్రభుత్వం గజిట్ విడుదల చేసిందన్నారు. కొత్త దుకాణాలకు లైసెన్స్ పీరియడ్ రెండేళ్లన్నారు. జిల్లాలో 9 ఎక్సైజ్ స్టేషన్ల పరిధిలో ఆయా స్టేషన్లకు సంబంధించిన మండలాల్లో మద్యం దుకాణాలకు దరఖాస్తులు తీసుకుంటామన్నారు. ఒక మద్యం దుకాణానికి ఒక వ్యక్తి ఎన్ని దరఖాస్తులైనా వేయవచ్చన్నారు. ప్రతి దరఖాస్తుకు తప్పనిసరిగా రూ.2 లక్షల ఫీజు చెల్లించాలన్నారు. ఈ ఫీజు తిరిగి చెల్లించమన్నారు. ఎకై్ౖసజ్ టాక్స్ జనాభా ప్రతిపదికన నిర్ణయించా మన్నారు. ప్రతి సంవత్సరం రిటైల్ టాక్స్ 10 శాతం పెరుగుతుందన్నారు. మున్సిపల్ కార్పొరేషన్‌లో 5 కి.మీ. పరిధిలో మద్యం దుకాణాల ఏర్పాటుకు కార్పొరేషన్ పన్నులు చెల్లించి పర్మిషన్ పొందాలన్నారు. సంవత్సరానికి 6 విడతలుగా సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించాల్సి ఉంటుందన్నారు. దరఖాస్తుల సమర్పణలో ఇబ్బందులు ఎదురైతే కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ నెంబరు 08562-246344ను సంప్రదించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ శాఖ ఉప కమిషనర్ జయరాజు, ఉప ప్రొహిబిషన్ ఎకై్ౖసజ్ అధికారి, అసిస్టెంట్ కమిషనర్ చంద్రశేఖర్‌రెడ్డి, ఏడీ పీఈవోలు వినోద్ కుమార్, కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.