వేంపల్లె అభివృద్ధికి చర్యలు తీసుకోండి
ABN , Publish Date - Oct 28 , 2024 | 11:51 PM
వేంపల్లె అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని పులివెందుల టీడీపీ ఇనచార్జ్ బీటెక్ రవి కి టీడీపీ జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి సిం గారెడ్డి జయరామిరెడ్డి విజ్ఞప్తి చేశారు.
వేంపల్లె, అక్టోబరు 28 (ఆంధ్రజ్యోతి) : వేంపల్లె అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని పులివెందుల టీడీపీ ఇనచార్జ్ బీటెక్ రవి కి టీడీపీ జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి సిం గారెడ్డి జయరామిరెడ్డి విజ్ఞప్తి చేశారు. పులివెందులలో ఉన్న బీటెక్ రవిని సోమవారం కలిసి వేంపల్లె సమస్యల గురించి వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఉచిత గ్యాస్ సిలిండర్లను ప్రకటించడం హర్షణీయమన్నారు.