Share News

సెలెక్టెడ్‌ ఎంపీటీసీలు రాజీనామా చేయాలి

ABN , Publish Date - Nov 30 , 2024 | 11:55 PM

ప్రజాస్వా మ్య బద్ధంగా గెలవని ఎంపీటీసీలు సమావేశానికి వచ్చే అర్హత లేదని, పదవుల కు రాజీనామా చేయాల ని టీడీపీ నేతలు డిమాం డ్‌ చేశారు.

సెలెక్టెడ్‌ ఎంపీటీసీలు రాజీనామా చేయాలి
నిరసన తెలియజేస్తున్నటీడీపీ నాయకులు

ఎంపీడీవో కార్యాలయం ఎదుట టీడీపీ శ్రేణుల నిరసన

హాజరు కాని వైసీపీ ప్రజాప్రతినిధులు వాయిదా పడ్డ మండల సమావేశం

ములకలచెరువు, నవం బరు 30(ఆంధ్రజ్యోతి): ప్రజాస్వా మ్య బద్ధంగా గెలవని ఎంపీటీసీలు సమావేశానికి వచ్చే అర్హత లేదని, పదవుల కు రాజీనామా చేయాల ని టీడీపీ నేతలు డిమాం డ్‌ చేశారు. ఆ మేరకు ములకలచెరువు మండల ప్రజా పరిషత కార్యాలయం ఎదుట శనివారం టీడీపీ శ్రేణులు నిరసన చేపట్టారు. ములకలచెరువు మండల సర్వసభ్య సమావేశం శనివారం జరిగేందుకు ఎంపీడీవో హరినారాయణ నిర్ణయిం చారు. దీంతో ప్రజాస్వామ్య బద్ధంగా గెలవని వైసీపీ ఎంపీటీసీలు, సర్పంచులు సమా వేశానికి వచ్చే అర్హత లేదని ఉదయం 7 గంటలకే టీడీపీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో కార్యాలయం వద్దకు చేరుకున్నారు. దీంతో వైసీపీ ఎంపీటీసీలు, సర్పంచులు సమావేశానికి హాజరు కాక పోవడంతో చివరకు సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లు ఎంపీడీవో హరినారాయణ ప్రకటించారు. ఈ క్రమంలో ఎంపీడీవో కార్యాలయం ఎదుట టీడీపీ నాయకులు, కార్యకర్తలు నిరసనకు దిగారు. ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర బీసీ సెల్‌ అధికార ప్రతినిధి గుత్తికొండ త్యాగరాజు, జిల్లా కార్య దర్శి యర్రగుడి సురేష్‌, మార్కెట్‌ కమిటీ మాజీ వైస్‌ ఛైర్మన కేవీ రమణ మాట్లాడు తూ ప్రస్తుతం ఉన్న వైసీపీ ఎంపీటీసీలు, సర్పంచులు ఎలక్ట్‌ కాలేదని సెలక్ట్‌ ఆయ్యారని ప్రజా స్వామ్యంగా గెలివని ప్రజాప్రతినిధులు సమావేశానికి వచ్చే అర్హత లేదన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ వైస్‌ ఎంపీపీ నరసింహారెడ్డి, నాయకులు భజంత్రి రామాంజు లు, కట్టా హరినాధ్‌, నాగరాజు, మస్తానరెడ్డి, కేశవరెడ్డి, చాంద్‌ బాషా, శేఖర్‌నాయు డు, నీలకం ఠారెడ్డి, బుర్రారమణ, మూగి రవిచంద్ర, శ్రీనివాసు లు, రెడ్డెప్ప, సుబ్బ నాయుడు, పాల రాము, ఎర్రంరెడ్డి, శంకర్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, దయ్యాల శ్రీనివాసులు, నారాయణ, రషీద్‌, మహిళా నేత గంగాదేవి, శ్యామల తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 30 , 2024 | 11:56 PM