Share News

ఎకరాకు రూ.కోటి నష్టపరిహారం ఇప్పించండి

ABN , Publish Date - Nov 29 , 2024 | 12:11 AM

ఎకరాకు రూ. కోటి నష్టపరిహారం ఇప్పించాలని టీడీపీ మండల పరిశీలకులు రఘునాథరెడ్డికి ఆ పార్టీ జిల్లా మాజీ కార్యదర్శి ఎద్దుల శేషారెడ్డి, గండి మాజీ చైర్మన రాజారావు, రాజా, కిషోర్‌ తదితరులు గురువారం వినతిపత్రం అందించారు.

ఎకరాకు రూ.కోటి నష్టపరిహారం ఇప్పించండి
రఘునాథరెడ్డికి వినతిపత్రం ఇస్తున్న వేంపల్లె నాయకులు, రైతులు

వేంపల్లె, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి): ఎకరాకు రూ. కోటి నష్టపరిహారం ఇప్పించాలని టీడీపీ మండల పరిశీలకులు రఘునాథరెడ్డికి ఆ పార్టీ జిల్లా మాజీ కార్యదర్శి ఎద్దుల శేషారెడ్డి, గండి మాజీ చైర్మన రాజారావు, రాజా, కిషోర్‌ తదితరులు గురువారం వినతిపత్రం అందించారు. అనం తరం వారు మాట్లాడుతూ చాగలమర్రి-రాయచోటి హైవే రోడ్డు వేంపల్లె పాపాఘ్ని నది పక్కన వేయనున్నారన్నారు. ఇందుకోసం రైతుల నుంచి భూమి తీసుకుంటున్నారన్నారు. దీంతో ఎకరాకు కనీసం రూ.కోటి ఇప్పించాలని వారు కోరా రు. ఈ విషయాన్ని టీడీపీ ఇనచార్జి బీటెక్‌ రవి ద్వారా కలెక్టర్‌ను కలిసి రైతులకు న్యాయం చేస్తామని ఈ సందర్భం గా వారికి ఆయన హామీ ఇచ్చారు.

Updated Date - Nov 29 , 2024 | 12:11 AM