Share News

ఒక రోజు ముందే ఎన్టీఆర్‌ భరోసా పింఛన్లు

ABN , Publish Date - Nov 30 , 2024 | 11:58 PM

మదనపల్లె నియో జకవర్గంలో ఒకటో తేదికన్నా ఒక రోజు ముందే ఎన్టీఆర్‌ భరో సా పింఛన్లను పంపిణీ చేస్తు న్నామని ఎమ్మెల్యే షాజహాన బాషా పేర్కొన్నారు.

ఒక రోజు ముందే ఎన్టీఆర్‌ భరోసా పింఛన్లు
కొత్తిండ్లులో పింఛన్లు పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే షాజహానబాషా

మదనపల్లె టౌన, నవంబరు 30 (ఆంధ్రజ్యోతి):మదనపల్లె నియో జకవర్గంలో ఒకటో తేదికన్నా ఒక రోజు ముందే ఎన్టీఆర్‌ భరో సా పింఛన్లను పంపిణీ చేస్తు న్నామని ఎమ్మెల్యే షాజహాన బాషా పేర్కొన్నారు. శనివారం పట్టణంలోని వడ్డిపల్లె, కొత్తిండ్లు, రామా రావుకాలని, శివాజినగర్‌, గొల్లపల్లె ప్రాంతాల్లో వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు ఎమ్మెల్యే పింఛన్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ ప్రమీల, ఎంపీడీవో తాజ్‌మస్రూర్‌, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. అనంతరం సీటీఎం రోడ్డులో ఎస్టేట్‌ వద్ద రహదారి పనులు ఆలస్యంగా చేస్తుండటంపై ఎమ్మెల్యే పరిశీలించారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా రోడ్డు నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని సూచించారు.

పెన్షన్లతో లబ్ధిదారులకు ఆత్మస్థైర్యం

పెద్దతిప్పసముద్రం నవంబరు 30 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అందిస్తు న్న ఎన్టీఆర్‌ భరోసా పెన్షన్లతో లబ్ధిదారుల్లో ఆత్మస్థైర్యం నిం పిందని తంబళ్లపల్లె నియోజక వర్గం తెలుగుదేశం పార్టీ నేత దాసరిపల్లె జయచంద్రారెడ్డి పేర్కొన్నారు. శనివారం ఆయన స్థానిక పీటీఎం లో ఎన్టీఆర్‌ భరోసా పెన్షన్లను ఎంపీడీవో అబ్దుల్‌ కలాం ఆజాద్‌, టీడీపీ నాయ కులతో కలిసి లబ్ధిదారులకు నేరుగా ఇంటి వద్దకే వెళ్లి పెన్షన్లు అందించారు. ఆయన వెంట టీడీపీ సీనియర్‌ నాయకులు కట్టా సురేంద్ర నాయుడు, స్థానిక సర్పంచ తమక శంకర, మాజీ ఎంపీటీసీ శేషాద్రి సురేష్‌బాబు, మడుమూరు యువనాయకుడు నవీన, పాలగిరి రామాంజులు, రాము, భజంత్రి రామచంద్ర, మస్తాన, కార్యం సుబ్రమణ్యం, శంకర, గంగులప్ప, సికిందర్‌ పాల్గొన్నారు.

Updated Date - Nov 30 , 2024 | 11:58 PM