భారీగా కర్ణాటక మద్యం స్వాధీనం..కారు సీజ్
ABN , Publish Date - Feb 13 , 2024 | 12:11 AM
అక్రమం గా తరలిస్తున్న కర్ణాటక మద్యాన్ని పోలీసులు సీజ్ చేశారు. సీ
ఫ నిందితుడి అరెస్టుఫ1350 టెట్రా పాకెట్లు, 48 క్వార్టర్ బాటిళ్లు లభ్యం
వాల్మీకిపురం, ఫిబ్రవరి 12: అక్రమం గా తరలిస్తున్న కర్ణాటక మద్యాన్ని పోలీసులు సీజ్ చేశారు. సీఐ పులి శేఖర్ ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి వాల్మీకిపురం రైల్వే స్టేషన సమీపం లో వాహనాల తనిఖీలు ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో ఏపీ39వీ యు5483 నెంబర్ గల కారులో అను మానాస్పద సోదాలు నిర్వహిం చారు. ఈ సందర్భంగా కారులో కర్ణాట క రాష్ట్రానికి చెందిన 1350 టెట్రా మద్యం పాకెట్లు, 48 క్వాటర్ బాటిళ్లు బయటపడ్డాయి. మద్యంతో పాటుగా కారును సీజ్ చేసి, అక్రమ రవాణాకు పాల్పడిన వాల్మీకిపురంకు చెందిన వ్యక్తి నరసింహులు(36)ను అరెస్టు చేశారు. స్థానిక ఎస్‌ఐ నాగేశ్వర్‌రావు కేసు నమోదు చేసి నిందితుడిని రిమాండు నిమిత్తం కోర్టుకు హాజరుపరిచినట్లు తెలిపారు. దాడుల్లో సిబ్బంది సతీష్, అబ్దుల్లా, రిజ్వాన, రామచంద్రనాయక్, ఆనంద్ పాల్గొన్నారు.