Share News

కాలం చెల్లిన బస్సులతో వేగేదెలా..?

ABN , Publish Date - Nov 30 , 2024 | 12:02 AM

రాయచోటి డిపోకు చెందిన బస్సులు గమ్యం చేరుస్తాయనే నమ్మకం లేకుండా పోయిందని ప్ర యాణికులు తెలిపారు.

కాలం చెల్లిన బస్సులతో వేగేదెలా..?
ఓబుళనాయునిపల్లె వద్ద మరమ్మతులకు గురైన బస్సు, మరో బస్సు కోసం వేచి ఉన్న ప్రయాణికులు

చక్రాయపేట, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి):రాయచోటి డిపోకు చెందిన బస్సులు గమ్యం చేరుస్తాయనే నమ్మకం లేకుండా పోయిందని ప్ర యాణికులు తెలిపారు. చాలా వరకు డొక్కు బస్సులను తిప్పు తుం డటంతో అవి మరమ్మతులకు గురవుతున్నాయని, దీంతో తమకు అవస్థలు తప్పడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు రోడ్డు కూడా అధ్వానంగా ఉండడంతో మరింత ఇబ్బంది పడు తున్నామని పేర్కొన్నారు. ఇందులో భాగంగా రాయచోటి-వేంపల్లె బస్సు ప్రయాణం చేయాలంటే చాలా కష్టంగా ఉందన్నారు. బస్సులు ఎక్కడపడితే అక్కడ నిలబడి పోతున్నాయని, దీంతో ప్రయాణం అంటేనే విసుగేస్తోందని తెలిపారు. ఇందులో భాగంగా ఓ బస్సు నాగులగుట్టపల్లె వద్ద మొరాయించడంతో ఆ బస్సు డ్రైవర్‌ ప్రయాణికులచే తోయించారు. మరో బస్సు గేర్‌బాక్సు మరమ్మతులకు గురై ఓబుళనాయునిపల్లె వద్ద నిలిచిపోయింది. ఇలా కాలం చెల్లిన బస్సులతో ప్రయాణం భారం గా మారిందని ప్రయాణికులు పేర్కొన్నారు. మంత్రి రాంప్రసాద్‌రెడ్డికి, ఉన్నతాధికారులకు పలుమార్లు పలుమార్లు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని పలువురు తెలిపారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఈ ప్రాంతంలో మంచి బస్సులు నడపాలని ప్రయాణికులు కోరుతున్నారు.

Updated Date - Nov 30 , 2024 | 12:02 AM