గోశాల ఏర్పాటు అభినందనీయం: కమిషనరు
ABN , Publish Date - Nov 29 , 2024 | 12:06 AM
గోవులకు కావాల్సిన అన్ని రకాల సౌకర్యాలతో గోశాలను ఏర్పాటు చే యడం అభినందనీయమని కార్పొరేషన కమిషనరు మనోజ్‌రెడ్డి అన్నారు.
కడప ఎడ్యుకేషన, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి) : గోవులకు కావాల్సిన అన్ని రకాల సౌకర్యాలతో గోశాలను ఏర్పాటు చే యడం అభినందనీయమని కార్పొరేషన కమిషనరు మనోజ్‌రెడ్డి అన్నారు. గురువారం బుగ్గ అగ్రహారం వద్ద బుగ్గమల్లేశ్వరస్వామి దేవస్థానం సమీపంలో కార్పొరేషన ఆధ్వర్యంలో ఏ ర్పాటు చేసిన గోశాలను ఆయన సందర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గోవులకు అవసరమైన ఆహారం అందించేందుకు 12 మంది సిబ్బంది అక్కడ పనిచేస్తున్నారన్నారు. గోవుల ఆరోగ్య పరిరక్షణకు ఇద్దరు వెటర్నరీ అసిస్టెం ట్లు కూడా అందుబాటులో ఉన్నారన్నారు. కార్పొరేషన పరిధిలో ర్డోడ్లపై తిరగడం వల్ల ప్రజలకు అసౌకర్యం కలుగుతుందని అలా తిరగే గోవులను గోశాలకు తరలించడమే మంచిదన్నారు. ఈ కార్యక్రమంలో గోశాల నిర్వాహకులు శ్రీరాములు, వెటర్నరీ అసిస్టెంట్లు, గోసంరక్షకులు, సిబ్బంది పాల్గొన్నారు.