Share News

NTR Fan: దేవర సినిమా చూసి చచ్చిపోతా

ABN , Publish Date - Sep 12 , 2024 | 07:18 AM

పందొమ్మిదేళ్ల వయసులోనే ఆ యువకుడు మృత్యువుతో పోరాడుతున్నాడు. బ్లడ్‌ కేన్సర్‌ రోజురోజుకీ మరణానికి దగ్గరవుతున్నాడు. తల్లిదండ్రులు బిడ్డను ఎలాగైనా బతికించుకోవాలని ఆరాటపడుతున్నారు. ‘‘నా బిడ్డ జూనియర్‌ ఎన్టీయార్‌కు వీరాభిమాని. దేవర సినిమా చూసి చచ్చిపోతా.. 27వ తేదీ దాకా బతికించండని వేడుకుంటున్నాడు.

NTR Fan: దేవర సినిమా చూసి చచ్చిపోతా

● అప్పటిదాకా బతికించండి.. ప్లీజ్‌

● బ్లడ్‌ కేన్సర్‌తో పోరాడుతున్న యువకుడి వేడుకోలు

● బోన్‌మారో చేయాలన్న వైద్యులు.. ఖర్చు 60 లక్షలు.. దాతలు ఆదుకోవాలని తల్లిదండ్రుల విజ్ఞప్తి


తిరుపతి, సెప్టెంబరు 11 (ఆంధ్రజ్యోతి): పందొమ్మిదేళ్ల వయసులోనే ఆ యువకుడు మృత్యువుతో పోరాడుతున్నాడు. బ్లడ్‌ కేన్సర్‌ రోజురోజుకీ మరణానికి దగ్గరవుతున్నాడు. తల్లిదండ్రులు బిడ్డను ఎలాగైనా బతికించుకోవాలని ఆరాటపడుతున్నారు. ‘‘నా బిడ్డ జూనియర్‌ ఎన్టీయార్‌కు వీరాభిమాని. దేవర సినిమా చూసి చచ్చిపోతా.. 27వ తేదీ దాకా బతికించండని వేడుకుంటున్నాడు. నా బిడ్డను బతికించండయ్యా’’ అంటూ ఆ యువకుడి తల్లి.. తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో బుధవారం మీడియా సమావేశంలో వేడుకున్నారు. టీటీడీలో కాంట్రాక్ట్‌ డ్రైవర్‌గా పనిచేస్తున్న శ్రీనివాసులు, సరస్వతి దంపతుల పెద్ద కుమారుడు కౌశిక్‌ (19)కు 2022 నుంచీ బ్లడ్‌ కేన్సర్‌ కు చికిత్స తీసుకుంటున్నాడు.


ప్రస్తుతం బెంగళూరులోని కిడ్‌వై హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. బోన్‌ మారో చికిత్సకు రూ.60లక్షలకు పైగానే ఖర్చవుతుందని వైద్యులు తెలిపారు. ‘అమ్మా.... నేను బతకనని తెలుసు. నా కోసం బాధపడకండి. దేవర సినిమా విడుదల వరకూ బతికించండి చాలు.. నా చివరి కోరిక తీర్చండి’ అని కౌశిక్‌ కోరుతున్నాడు. సాయం చేయదలచిన వారు 9490829381 ఫోన్‌ నంబర్‌కు ఫోన్‌పే, గూగుల్‌పే ద్వారా గానీ, లేదా కె.సరస్వతి, యూనియన్‌ బ్యాంక్‌ అకౌంట్‌ నంబరు 103310100044506 (IFSC UBIN0801313)కు సాయం అందించవచ్చు. 79956 65169 ఫోన్‌ నంబరులో కౌశిక్‌ తల్లిదండ్రులను సంప్రదించవచ్చు.

Updated Date - Sep 12 , 2024 | 07:23 AM