టీడీపీ ‘పట్టభద్ర’ అభ్యర్థులకు జనసేన, బీజేపీ ఓకే
ABN , Publish Date - Oct 21 , 2024 | 03:53 AM
ఉమ్మడి కృష్ణా-గుంటూరు, తూర్పు-పశ్చిమగోదావరి జిల్లాల పట్టభద్ర ఎమ్మెల్సీ నియోజకవర్గాలకు జరిగే ఎన్నికల్లో పోటీచేసే ఎమ్మెల్సీ అభ్యర్థులను టీడీపీ ఆదివారం అధికారికంగా ప్రకటించింది.
అధికారికంగా ఆలపాటి, పేరాబత్తుల పేర్ల ప్రకటన
అమరావతి, అక్టోబరు 20(ఆంధ్రజ్యోతి): ఉమ్మడి కృష్ణా-గుంటూరు, తూర్పు-పశ్చిమగోదావరి జిల్లాల పట్టభద్ర ఎమ్మెల్సీ నియోజకవర్గాలకు జరిగే ఎన్నికల్లో పోటీచేసే ఎమ్మెల్సీ అభ్యర్థులను టీడీపీ ఆదివారం అధికారికంగా ప్రకటించింది. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు కృష్ణా-గుంటూరు అభ్యర్థిగా మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ (రాజా), తూర్పు-పశ్చిమగోదావరి అభ్యర్థిగా పేరాబత్తుల రాజశేఖరం పేర్లును పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు వెల్లడించారు. వీరి పేర్లపై టీడీపీ నాయకత్వం జనసేన, బీజేపీ అగ్రనేతలతో చర్చించింది. వారి ఆమోదంతో అభ్యర్థులను ఖరారు చేసినట్లు టీడీపీ వర్గాలు తెలిపాయి.