‘ఏలేరు‘ను ముంచింది జగనే
ABN , Publish Date - Sep 12 , 2024 | 03:26 AM
జగన్ ఓ పనికిమాలిన వ్యక్తి అని సీఎం చంద్రబాబు ఆక్షేపించారు.
ఏలేరు ఆధునికీకరణ పనులు ఆపేశారు
నేనే గనుక రాజకీయాలను పక్కనపెడితే అందరినీ తాట తీసేవాడిని: చంద్రబాబు
జగన్ ఓ పనికిమాలిన వ్యక్తి అని సీఎం చంద్రబాబు ఆక్షేపించారు. ‘‘ఏలేరు ఆధునికీకరణకు గతంలో నేను శ్రీకారం చుట్టా. జగన్ వచ్చి పనులు ఆపేశారు. అప్పట్లో పనులు పూర్తి చేస్తే ఇప్పుడు ఇన్ని ఇబ్బందులు వచ్చేవి కావు’’ అని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. తాను రాజకీయాలను పక్కనపెడితే అందరి తాట తీసేవాడినని ఆగ్రహించారు. వరద ప్రభావిత కాకినాడ, ఏలూరు జిల్లాల పర్యటన సందర్భంగా గత ఐదేళ్లలో జగన్ వ్యవహరించిన తీరును గర్హించారు. ‘‘ఇటీవల ఎన్నికల్లో శ్రీకాకుళం నుంచి గుంటూరు వరకు వైసీపీకి రెండే రెండు సీట్లు వచ్చాయి. జగన్ వద్దని జనం ఛీకొట్టారు. జగన్ దిగిపోయి నా ఆయన చేసిన పాపాలు వెంటాడుతున్నా యి’’ అని తెలిపారు. ప్రకాశం బ్యారేజీకి మూడు పడవలు పంపి బ్యారేజీని డ్యామేజీ చేయడానికి జగన్ ప్రయత్నించారని మండిపడ్డారు. ‘‘గతంలో బాబాయిని చంపి ఏవిధంగా ఆ నెపం టీడీపీపై జగన్ నెట్టారో, ఇప్పుడు బ్యారేజీని దెబ్బతీసి జనాలను చంపేసి ప్రభుత్వంపై నెట్టే ప్రయత్నం చేశారు. బ్యారేజీ నుంచి 11. 40 లక్షల క్యూసెక్కు ల నీటిని దిగువకు విడుదల చేస్తున్న సమయం లో ఏకంగా ఐదు టన్నులు బరువు ఉండే 3 బోటులను ఒకదానికి ఒకటి తాడు కట్టి వదిలా రు. దానివల్ల ఒకవేళ బ్యారేజీ దెబ్బతిని ఉంటే లంక గ్రామాల ప్రజల పరిస్థితి ఏమై ఉండేది? ఒక నేరస్థుడితో రాజకీయాలు చేయడం తప్పడం లేదు. ప్రజాహితం కోసం ఉద్యమం తప్పడం లేదు.మమ్మల్ని గెలిపించిన ప్రజలను నాశనం చేయాలని ఇలాంటివి చేస్తున్నారు. ఇలాంటి పార్టీ(వైసీపీని ఉద్దేశించి) దేశంలో ఎక్కడా ఉండ దు. బుడమేరకు కూడా గండి కొట్టారు’’ అని చంద్రబాబు అన్నారు.