Share News

ప్రతి ఇంట్లోనూ అదేకష్టం!

ABN , Publish Date - Sep 12 , 2024 | 12:53 AM

బుడమేరు వరద వేలాది మంది ప్రజలకు కనిపించే కష్టంతోపాటు కనిపించని నష్టాన్ని కూడా తెచ్చి పెట్టింది. వరద నీ టిలో నాలుగైదు రోజులపాటు ఇళ్లు నాని పోవట ంతో ఇంట్లో ఉపయోగించే ఫర్నిచర్స్‌ పనికిరాకుండా పోయాయి.

ప్రతి ఇంట్లోనూ అదేకష్టం!

ఆంధ్రజ్యోతి, విజయవాడ: బుడమేరు వరద వేలాది మంది ప్రజలకు కనిపించే కష్టంతోపాటు కనిపించని నష్టాన్ని కూడా తెచ్చి పెట్టింది. వరద నీ టిలో నాలుగైదు రోజులపాటు ఇళ్లు నాని పోవట ంతో ఇంట్లో ఉపయోగించే ఫర్నిచర్స్‌ పనికిరాకుండా పోయాయి. కేన్‌ కుర్చీలు, సోఫాలు, నవ్వారు, సాధారణ, డబుల్‌కాట్‌ మంచాలు, పరుపులు, దిండ్లు, దు ప్పట్లు, బట్టలు, తట్టా, బుట్టలు వంటి వాటికి భారీ డ్యామేజీ జరిగింది. ఫోమ్‌ సోఫాలు, కుర్చీలు, పరుపులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఇవన్నీ పనికిరాకుం డా పోవటం గమనార్హం. ఇళ్లను శుభ్రం చేసుకుంటుండగా చీకిపోయిన ఫర్నిచర్‌, పరుపులు, దుప్ప ట్లు, సోఫాలు రోడ్డుపై చెత్త మాదిరిగా పోగు చేస్తున్నారు. ప్రతి ఇంటిలోనూ ఇదే నష్టం వాటిల్లింది. ఇ లా ప్రతి కుటుంబంలోనూ రూ.10 నుంచి రూ.20 వేల వరకు నష్టం జరిగినట్టుగా తెలుస్తోంది. రెండవది కిచెన్‌ రూపంలో జరిగింది. ఇంట్లోని ఉల్లిపాయ లు, ఎండు మిర్చి, పోపుల డబ్బాలు, సరుకులు వరదార్పణమయ్యాయి. బియ్యం బస్తాలు నానిపోయా యి. పాడైన వాటిని బుధవారం పెద్ద సంఖ్యలో ప్ర జలు బయట రోడ్లపై పోగు పోశారు. ప్రాథమిక న ష్టంతో పాటు రిపేర్ల పరంగా మరికొంత అదనపు నష్టం జరిగింది. ఇళ్ల ముందు నిలిపి ఉంచిన కార్లు, ఆటోలు, ద్విచక్ర వాహనాలు వరద నీటిలో మునిగిపోవటంతో వాటి రిపేర్లు ఖర్చుతో కూడుకుని ఉంది. ద్విచక్ర వాహనానికి రూ.500 నుంచి రూ.2వేల వర కు ఖర్చవుతోంది. అలాగే ఫ్రిజ్‌లు, వాషింగ్‌ మెషీన్లు, ఏసీల రిపేర్లకు చేతిచమురు వదిలించుకోవాల్సి వ స్తోంది. రెండు రోజులుగా పనికిరాని బట్టల ఏరివేత నడుస్తోంది. బట్టలు కోల్పోవటం ఒక నష్టమైతే.. మ ళ్లీ కొనుక్కోవటం ఖర్చుతో కూడుకున్న వ్యవహారమే. ఈ వరదల కారణంగా ప్రతి ఇంట్లో కనిష్టంగా రూ. 10 నుంచి గరిస్టంగా రూ.50వేల వరకు నష్టం జరిగినట్టు తెలుస్తోంది. వరద తగ్గినా రోడ్లపై ఇంకా ము రుగు ఉండటంతో వాటిలోనే నడవాల్సి వస్తోంది. ఫ్ల డ్‌ ఎన్యూమరేషన్‌లో భాగంగా రెవెన్యూ అధికారు లు పెద్ద ఎత్తున సర్వే చేపడుతున్నారు. ఇంటికి వా టిల్లిన నష్టం నుంచి వ్యక్తిగతంగా అన్ని రకాల నష్టా న్ని అంచనా వేస్తున్నారు. వ్యక్తిగత గృహాలు, కమర్షియల్‌ భవనాలు, దుకాణాలకు సర్వే జరుగుతోంది. ఎన్నో కుటుంబాలు సర్వం పోగొట్టుకున్నాయి. ఫైన ల్‌ ఎన్యూమరేషన్‌తోనే వాస్తవిక నష్టం తెలుస్తుంది.

Updated Date - Sep 12 , 2024 | 08:14 AM