పబ్లిక్ హెల్త్ భవనం ప్రారంభం
ABN , Publish Date - Oct 30 , 2024 | 11:56 PM
స్థానిక పీహెచసీ ఆవరణంలో రూ.50 లక్షలతో నిర్మించిన బ్లాక్ పబ్లిక్ హెల్త్ సెంటర్ భవనాన్ని ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డి బుధవారం ప్రారంభించారు.
ఓబుళదేవరచెరువు, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి): స్థానిక పీహెచసీ ఆవరణంలో రూ.50 లక్షలతో నిర్మించిన బ్లాక్ పబ్లిక్ హెల్త్ సెంటర్ భవనాన్ని ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డి బుధవారం ప్రారంభించారు. అనంతరం మండల కేంద్రంలో వాల్మీక మహర్షి విగ్రహాన్ని ఆవిష్కరించారు. స్థానిక ప్రభుత్వ వైద్యశాలను 30 పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేయాలని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఆంజి, కార్యదర్శి చలపతినాయుడు ఎమ్మెల్యేకు వినతిపత్రం అందించారు. కార్యక్రమాల్లో డీఎం హెచఓ మంజుల, డీఐఓ నాగేంద్రనాయక్, ఎంపీడీఓ రాబర్టు విల్సన, తహసీల్దార్ అనంతాచారి, మండల కన్వీనర్ శెట్టివారి జయచంద్ర పాల్గొన్నారు.