Share News

కోలాహలంగా గణేశ్‌ నిమజ్జనం

ABN , Publish Date - Sep 12 , 2024 | 12:14 AM

బనగానపల్లె, డోన్‌, ఆళ్లగడ్డ, సంజామల తదితర ప్రాంతాల్లో ఐదు రోజులుగా పూజలందుకున్న గణేశులు బుధవారం నిమజ్జనానికి తరలివెళ్లారు.

కోలాహలంగా గణేశ్‌ నిమజ్జనం
డోన్‌ పట్టణంలోని అబిరెడ్డిపల్లె చెరువులో నిమజ్జనమవుతున్న గణనాథుడు

బనగానపల్లె/డోన్‌/రూరల్‌/ఆళ్లగడ్డ/సంజామల/కోవెలకుంట్ల/ సెప్టెంబరు 11: బనగానపల్లె, డోన్‌, ఆళ్లగడ్డ, సంజామల తదితర ప్రాంతాల్లో ఐదు రోజులుగా పూజలందుకున్న గణేశులు బుధవారం నిమజ్జనానికి తరలివెళ్లారు. ఉదయం నుంచే మండపాల వద్ద ప్రత్యేక పూజలు చేశారు. అ నంతరం సంప్రదాయబద్ధంగా అత్యంత భక్తిశ్రద్ధలతో ఉత్సాహంగా రంగులు చల్లుకుంటూ మహిళలు, యువ కులు, నృత్యాలుచేస్తూ నిమజ్జనానికి తరలించారు.

= బనగానపల్లె పట్టణంలో పెండేకంటినగర్‌లో ఉట్టికొట్టే పోటీలు ఆకట్టుకున్నాయి. ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన గణేశ్‌ నిమజ్జనం సందర్భంగా విజయవాడకు చెందిన కళాకారులు వివిధ వేషధారణ లతో చేసిన నృత్యాల ఊరేగింపు పలువురిని ఆకట్టుకుం ది. పట్టణంలోని పెండేకంటినగర్‌, కొండపేట, పొట్టి శ్రీరాముల కూడలి, సీఐ కార్యాలయం, ఆస్థానం రోడ్డు, పాత ఆంరఽధాబ్యాంక్‌, పెట్రోల్‌బంకు, జీఎం టాకీస్‌ మీదు గా కైప చెర్వుకు ఊరేగింపుగా విగ్రహాలు బయలుదే రాయి. ఈసందర్భంగా నెహ్రూస్కూల్‌ యాజ మాన్యం భక్తులకు మజ్జిగ పాకెట్లు అందించగా, గణేశ్‌ నిమజ్జన కమిటీ ఆధ్వర్యంలో పెట్రోల్‌బంకు కూడలిలో అల్పాహా రం, పలుకూరు వైద్యశాల సిబ్బంది మెడికల్‌ క్యాంపు ఏర్పాటు చేశారు. మండలంలోని కైప చెర్వు వద్ద గణేశ్‌ నిమజ్జం సందర్భంగా ప్రత్యేక క్రేన్‌ల ద్వారా నిమజ్జనం చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుం డా పట్టణంలో బనగానపల్లె సీఐ మంజునాథరెడ్డి, కృష్ణయ్య, ఎస్‌ఐ దుగ్గిరెడ్డి, నందివర్గం ఎస్‌ఐ వెంకట సుబ్బయ్య, పోలీస్‌ సిబ్బంది ప్రత్యేక బందోబస్తు నిర్వ హించారు. ఊరేగింపు కార్యక్రమాన్ని ఉత్సవ కమి టీ అధ్యక్షుడు మల్లారెడ్డి, సలహాదారు టంగుటూరు శ్రీన య్య, కమిటీ సభ్యులు పర్యవేక్షించారు. అలాగే యాగంటిపల్లె గ్రామంలో నిమజ్జన కార్యక్రమం ప్రశాంతంగా ముగిసింది.

= డోన్‌ పట్టణంలో బుధవారం నిర్వహించిన గ ణేష్‌ నిమజ్జన వేడుకల్లో ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్‌ రెడ్డి పాల్గొన్నారు. ముందుగా ప ట్టణంలోని అమ్మ వారిశాల వీధిలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహానికి, స్థానిక టీడీపీ కార్యా లయ ఆవరణలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహానికి ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహిం చారు. అనంతరం గణేష్‌ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు కోట్రికే ఫణిరాజ్‌, మునిసిపల్‌ వైస్‌ చైర్మన్‌ కోట్రికే హరికిషణ్‌, తహసీల్దార్‌ నాగమణి, రూరల్‌ సీఐ సీఎం రాకేష్‌లతో కలిసి అభిరెడ్డిపల్లె చెరువులో వద్ద నిమజ్జన వేడుకలను ఎమ్మెల్యే కోట్ల తిలకించారు. అలాగే గణేష్‌ నిమజ్జన కార్యక్రమంలో డోన్‌ మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.

= ఆళ్లగడ్డ పట్టణంలో బుధవారం గణేష్‌ నిమజ్జనం ప్రశాంతంగా నిర్వహించారు. పట్టణ శివా ర్లలోని వక్కిలేరు వాగులో గణనాఽథులను గణేష్‌ ఉత్స వ కమిటీసభ్యుల ఆధ్వర్యంలో నిమజ్జనం కార్యక్రమాన్ని నిర్వహించారు. పోలీసులు బందోబస్తు నిర్వహించారు.

= సంజామల మండల కేంద్రంలో కొలువుదీరిన గణపయ్యలను బుధవారం నిమజ్జనం చేశారు. గ్రామ టీడీపీ నాయకులు పెండేకంటి కిరన్‌ కుమార్‌, గ్రామ సంఘం పెద్దలు, గ్రామస్థుల సహకారంతో ఐదు రోజుల పాటు లంబోదరులకు ప్రత్యేక పూజలు, నైవేద్యా లు సమర్పించి మధ్యాహ్నం నుంచి గ్రామోత్సవం నిర్వ హిం చారు. గణపయ్యలను ఊరేగింపుగా తీసుకెళ్లి స్థాని క పాలేరులో నిమజ్జనం చేశారు.

= కోవెలకుంట్ల పట్టణంలో బుధవారం అత్యంతవైభవంగా వినాయక నిమజ్జన కార్యక్రమం నిర్వహించారు. పట్టణంలోని సంతపేట, రంగరాజుపేట, ఎల్‌ఎంకాంపౌండు, జమ్మలమడుగు చౌరస్తా, ఆర్టీసీ బస్టాండు మీదుగా వివిధ విగ్రహాలను వైభవంగా ఊరేగించుకుంటూ కుందూ వద్దకు తీసుకెళ్లి అక్కడ నిమజ్జనం చేశారు.

Updated Date - Sep 12 , 2024 | 12:14 AM