బాధితుల్ని దోచుకోవాలని చూస్తే అరెస్టు చేసి లోపల పడేస్తాం
ABN , Publish Date - Sep 05 , 2024 | 03:48 AM
విజయవాడ నగరంలో వరద ముంపునకు గురైన ప్రాంతాల్లో రెండు రోజుల్లో సాధారణ పరిస్థితులు నెలకొనే అవకాశం ఉందని సీఎం చంద్రబాబు అం చనా వేశారు.
ప్రైవేట్ బోట్లకు అనుమతి లేదు: బాబు
విజయవాడ నగరంలో వరద ముంపునకు గురైన ప్రాంతాల్లో రెండు రోజుల్లో సాధారణ పరిస్థితులు నెలకొనే అవకాశం ఉందని సీఎం చంద్రబాబు అం చనా వేశారు. ప్రజల ఇబ్బందులను ఆసరా చేసుకొని వారిని ఎవరైనా దోచుకోవాలని చూస్తే అరెస్టు చేయిస్తామని ఆయన హెచ్చరించారు. ‘‘ప్రైవేటు బోట్లు వరద ప్రాంతాల్లో తిరగడానికి అనుమతి లేదు. వా టిని ప్రభుత్వానికి ఇస్తే వారికి మేమే రోజుకు ఇం త ని చెల్లిస్తాం. ఎవరైనా ఇష్టం వచ్చినట్టు డబ్బులు డి మాండ్ చేస్తే పోలీసులకు చెప్పండి. కూరగాయల ధరలు పెరగకుండా ప్రభుత్వం తరపున మేమే అమ్మించాలని నిర్ణయించాం’’ అని అన్నారు. ‘‘పారిశుధ్య సమస్యల వల్ల జ్వరాలు వంటివి వ్యాపించే ప్రమాదం ఉంది. అందుకే 62 శిబిరాలు ఏర్పాటయ్యాయి. కాల్వలు, రోడ్లు త్వరగా శుభ్రం చేయడాని కి రెండు వేల మంది పారిశుధ్య కార్మికులను ఏర్పా టు చేస్తున్నాం. ఇళ్లలో పేరుకుపోయిన బురదను తొలగించేందుకు 150 ఫైర్ ఇంజన్లు ఏర్పాటు చేస్తాం. మంచినీటి కోసం 182 ట్యాంకర్లు ఉంచాం. వరద తగ్గిన చోట బుధవారం సాయంత్రం నుంచి కరెంటు ఇస్తాం’’ అని చంద్రబాబు తెలిపారు.