Satyakumar: నిరుద్యోగ సమస్యలపై పోరాడే విద్యార్థి నేతల అరెస్టు సిగ్గుచేటు
ABN , Publish Date - Feb 13 , 2024 | 04:29 PM
నిరుద్యోగ సమస్యలపై పోరాడే విద్యార్థి నేతల అరెస్టు సిగ్గుచేటని బీజేపీ జాతీయ కార్యదర్శి సత్య కుమార్ (Satyakumar) అన్నారు. మంగళగిరి పోలీస్ స్టేషన్‌లో ఏబీవీపీ కార్యకర్తలను సత్యకుమార్, వల్లూరు జయ ప్రకాష్ నారాయణ మంగళవారం నాడు పరామర్శించారు.
గుంటూరు జిల్లా: నిరుద్యోగ సమస్యలపై పోరాడే విద్యార్థి నేతల అరెస్టు సిగ్గుచేటని బీజేపీ జాతీయ కార్యదర్శి సత్య కుమార్ (Satyakumar) అన్నారు. మంగళగిరి పోలీస్ స్టేషన్‌లో ఏబీవీపీ కార్యకర్తలను సత్యకుమార్, వల్లూరు జయ ప్రకాష్ నారాయణ మంగళవారం నాడు పరామర్శించారు. ఈ సందర్భంగా సత్యకుమార్ మాట్లాడుతూ... దళితులపై అత్యాచారాలు చేసిన వారికి తాడేపల్లి ప్యాలెస్‌లో విందులు ఇస్తున్నారని ఆరోపించారు. తాడేపల్లి ప్రాంతంలో జరిగే అసాంఘీక కార్యకలపాలు సీఎం జగన్ రెడ్డికు కనబడవా..? అని ప్రశ్నించారు. ఏపీలో శాంతి భద్రతలు పూర్తిగా విఫలం చెందాయని మండిపడ్డారు. వైసీపీ ‘‘సిద్ధం’’ అని హోర్డింగ్‌లు వేసుకున్న జగన్ రెడ్డిను సాగనంపేందుకు ప్రజలు కూడా ‘‘సిద్ధం’’గా ఉన్నారని సత్యకుమార్ తెలిపారు.