Share News

CM Chandrababu: సీఎం చంద్రబాబుకు.. మేయప్పన్ లేఖ.. కారణమిదే..?

ABN , Publish Date - Jul 17 , 2024 | 08:49 PM

ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుకు (CM Nara Chandrababu Naidu) కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మేయప్పన్ లేఖ రాశారు. సిలికా శాండ్ సరఫరా నిలిచి పోవడంతో ఫౌండ్రి పరిశ్రమలు మూత పడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.

CM Chandrababu: సీఎం చంద్రబాబుకు.. మేయప్పన్ లేఖ.. కారణమిదే..?

అమరావతి: ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుకు (CM Nara Chandrababu Naidu) కాంగ్రెస్ ఏపీ వ్యవహారాల ఇన్‌చార్జి మేయప్పన్ లేఖ రాశారు. సిలికా శాండ్ సరఫరా నిలిచి పోవడంతో ఫౌండ్రి పరిశ్రమలు మూత పడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. వేలాది కార్మికులు జీవనోపాధి కోల్పోతున్నారని లేఖలో మేయప్పన్ పేర్కొన్నారు. జూన్‌లో రాష్ట్రంలో రాజకీయ పరిణామాల నేపథ్యంలో సిలికా శాండ్ సరఫరా పూర్తిగా నిలిపివేశారని సీఎం దృష్టికి మేయప్పన్ తీసుకొచ్చారు. వెంటనే సిలికా శాండ్ సరఫరా పునర్డుద్ధరించాలని సీఎం చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు.


కాగా.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు (CM Chandra Babu) ఢిల్లీ పర్యటన ముగిసింది. నిన్న సాయంత్రం ఆయన ఢిల్లీకి వెళ్లారు. రాత్రి కేంద్ర హోమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. ఇక ఇవాళ ఉదయం సీఎం అధికారిక నివాసం(1, జన్‌పథ్)లో పూజలు నిర్వహించారు. అనంతరం విజయవాడకు చంద్రబాబు తిరుగు ప్రయాణమయ్యారు. ఏపీ ఆర్థిక పరిస్థితి గురించి అమిత్ షాకు చంద్రబాబు వివరించారు. గత ఐదేళ్లలో రాష్ట్రం ఆర్థిక విధ్వంసానికి గురైందని వెల్లడించారు. అస్తవ్యస్థ నిర్వహణ, అవినీతి కారణంగా ఏపీ ఆర్థిక వ్యవస్థ గాడి తప్పిందని చంద్రబాబు తెలిపారు.


2019-24 ఆర్థిక సంవత్సరాల మధ్య మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అదుపు తప్పి, అస్థిరమైన అప్పులను వివరిస్తూ విడుదల చేసిన నాలుగు శ్వేతపత్రాలను అమిత్ షాకు వివరించానని చంద్రబాబు తెలిపారు. ప్రజలు ఏపీలో ఎన్డీఏకు అనుకూలంగా తీర్పునిచ్చారని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి రాష్ట్రాన్ని గాడిలో పెడతాయని చంద్రబాబు ట్వీట్ చేశారు. పర్యటనలో సీఎంతో పాటు రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, కేంద్ర మంత్రులు కే. రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, ఎంపీలు లావు శ్రీకృష్ణ దేవరాయలు, కేశినేని చిన్ని తదితరులు ఉన్నారు.

Updated Date - Jul 17 , 2024 | 09:04 PM