విజయ్‌పాల్ కస్టడీ పిటిషన్ రిటర్న్
ABN , Publish Date - Nov 30 , 2024 | 04:12 AM
విశ్రాంత అడిషనల్ ఎస్పీ విజయ్‌పాల్‌ను విచారణ కోసం ఐదు రోజులపాటు తమ కస్టడీకి అప్పగించాలని కోరుతూ గుంటూరు నగరంపాలెం పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు రిటర్న్ చేసింది.
గుంటూరు(లీగల్), నవంబరు 29(ఆంధ్రజ్యోతి): విశ్రాంత అడిషనల్ ఎస్పీ విజయ్‌పాల్‌ను విచారణ కోసం ఐదు రోజులపాటు తమ కస్టడీకి అప్పగించాలని కోరుతూ గుంటూరు నగరంపాలెం పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు రిటర్న్ చేసింది. మాజీ ఎంపీ రఘురామకృష్ణరాజుపై కస్టోడియల్ టార్చర్ కేసులో అరెస్టయి జిల్లా జైలులో జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్న విజయ్‌పాల్‌ను పోలీస్ కస్టడీకి అప్పగించాలని కోరుతూ నగరంపాలెం పోలీసులు గురువారం గుంటూరు స్పెషల్ మొబైల్ కోర్టులో పిటిషన్ వేశారు. అయితే ఆ పిటిషన్‌ను పరిశీలించిన న్యాయమూర్తి కొన్ని కారణాలను ఉటంకిస్తూ విచారణకు స్వీకరించలేదు. తగిన వివరణతో శనివారం తిరిగి కోర్టులో పిటిషన్ దాఖలు చేస్తామని పోలీసులు తెలిపారు. కాగా, రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో ఐదో నిందితురాలిగా ఉన్న అప్పటి గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభావతి తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ దాఖలు చేసుకున్న పిటిషన్ డిసెంబరు 2కు వాయిదా పడింది.