వైభవంగా స్వాతి మహోత్సవం
ABN , Publish Date - Nov 30 , 2024 | 12:06 AM
ప్రముఖ వైష్ణవ క్షేత్రమైన అహోబిలంలో స్వాతి మహోత్సవం శుక్రవారం వైభవంగా నిర్వహించా రు.
ఆళ్లగడ్డ(శిరివెళ్ల), నవంబరు 29(ఆంధ్రజ్యోతి) : ప్రముఖ వైష్ణవ క్షేత్రమైన అహోబిలంలో స్వాతి మహోత్సవం శుక్రవారం వైభవంగా నిర్వహించా రు. నరసింహ స్వామి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకుని దిగువ అహోబిలంలోని శ్రీదేవి, భూదేవి సమేత ప్రహ్లాదవరదస్వామి ఉత్సవమూర్తులను యాగశాలలో కొలువుదీర్చి అభిషేకం, తిరుమంజనం నిర్వహించారు. స్వామి, అమ్మవార్లకు ఎదురుగా ఏర్పాటు చేసిన హోమగుండంలో శాసో్త్రక్తంగా సుదర్శనహోమం, పూర్ణాహుతి నిర్వహించారు. స్వామి, అమ్మవార్లను విశేషంగా అలంకరించి అర్చకులు ప్రత్యేక పూజలు, కల్యాణం నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి తరలి వచ్చిన భక్తులు స్వాతి వేడుకల్లో పాల్గొన్నారు. శ్రీదేవీ, భూదేవీ సమేత ప్రహ్లాదవరదస్వామి ఉత్సవమూర్తులను సా యంత్రం పల్లకిలో కొలువుంచి మాడ వీధుల్లో గ్రామోత్సం నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకుడు కిడాంబి వేణుగోపాలన, మణియార్ సౌమ్యనారాయణన ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి.
రుద్రవరం : మండలంలోని నరసాపురం, రుద్రవరం గ్రామాల్లోని దొర్వి, గుట్టకొండ నరసాపురం గ్రామాల్లోని లక్ష్మీనరసింహస్వామి దేవాలయాల్లో శుక్రవారం స్వాతి వేడుకలు నిర్వహించారు. ఆయా గ్రామాల్లోని దేవాలయా ల్లో అర్చకులు అభిషేకం చేసి పూజలు ప్రారంభించారు. వివిధ ప్రాంతాలనుం చి తరలివ చ్చిన భక్తులుస్వామి అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు పంచిపెట్టారు.