వెంటాడుతున్న నీటి సమస్య
ABN , Publish Date - Oct 21 , 2024 | 12:47 AM
అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్న చందంగా మారింది కరగపాడు, బుచ్చయ్యపాలెం గ్రామ ప్రజల పరిస్థితి. బుచ్చయ్యపాలెంలో నీటి సమ స్య ఎక్కువగా ఉండటంతో 2018లో అప్పటి టీడీపీ ప్రభుత్వం స్పెషల్ డెవలప్‌మెంట్ ఫండ్‌తో యుద్ధ ప్రతిపాదికన ఓహెచ్‌ఎస్‌ఆర్ ట్యాంకు నిర్మించింది.
కరగపాడు, బుచ్చయ్యపాలెం వాసుల దాహం కేకలు
పట్టించుకోని యంత్రాంగం
గోపాలపురం, అక్టోబరు 20(ఆంధ్రజ్యోతి): అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్న చందంగా మారింది కరగపాడు, బుచ్చయ్యపాలెం గ్రామ ప్రజల పరిస్థితి. బుచ్చయ్యపాలెంలో నీటి సమ స్య ఎక్కువగా ఉండటంతో 2018లో అప్పటి టీడీపీ ప్రభుత్వం స్పెషల్ డెవలప్‌మెంట్ ఫండ్‌తో యుద్ధ ప్రతిపాదికన ఓహెచ్‌ఎస్‌ఆర్ ట్యాంకు నిర్మించింది. తదనంతరం వైసీపీ ప్రభు త్వం అధికారంలోకి వచ్చాక అది ప్రారంభానికి నోచుకోలేదు. ప్రజలగోల భరించలేక ట్యాంకు నిర్మాణానికి సుదూర ప్రాంతంలో ఎంపీపీ నిధు లతో బోరు వేశారు. అయినప్పటికి గ్రామంలో నీటి సమస్య అపరిష్కృంగా ఉండిపోయింది. ఇటీవల కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎమ్మెల్యే మద్దిపాటి వెంకట్రాజుకు గ్రామస్థులు నీటి సమస్య తెలిపారు. యుద్ధ ప్రాతిపాదికన సమస్య పరిష్కరిస్తానని ఆయన హామీ ఇచ్చారు.
విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ ఎక్కడ?
కరగపాడు గ్రామంలో నీటి సరఫరాకు అవ సరమయ్యే ట్రాన్స్‌ఫార్మర్‌ను ఏర్పాటు చేయ డంలో అధికారులు, పాలకులు విఫలమయ్యా రని పలువురు విమర్శిస్తున్నారు. ఓహెచ్‌ఎస్‌ఆర్ వాటర్ ట్యాంకు బోరు ఉన్న నీటి సరఫరాకు అవసరమయ్యే ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటులో నిర్లక్ష్య ంగా వ్యవహరిస్తున్నారని ప్రజలు ధ్వజమెత్తు తున్నారు.
వెంటాడుతున్న విద్యుత్ సమస్య
బుచ్చయ్యపాలెంలో లోఓల్టేజీ సమస్య వెంటాడుతోంది. ప్రతినెలా కరెంటు బిల్లులు సక్రమంగా చెల్లిస్తున్నా లోఓల్టేజ్ పరిష్కారానికి ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేయాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. వెంటనే నూతన విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేసి లోఓల్టేజ్ సమస్య పరిష్కరించాలని బుచ్చయ్యపాలెం ప్రజలు కోరుతున్నారు.