వరద బాధితులను ఆదుకోవడం ప్రతిఒక్కరి కర్తవ్యం
ABN , Publish Date - Sep 05 , 2024 | 01:01 AM
వరద భీభత్సంతో అతలాకుతలమైన విజయవాడ వాసులను ఆదుకోవడం ప్రతిఒక్కరి కర్తవ్యమని స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి వారికి అవసరమైన ఆహారం మంచినీరు అందించాలని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. విజయవాడ వరద బాధితుల కోసం 10వేల మందికి సరిపడా ఆహార పదార్థాలు తరలిస్తున్న వ్యాన్లను అనపర్తి దేవీచౌక్ వద్ద ఆయన జెండా ఊపి వాహనాలను ప్రారంభించారు.
ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి
అనపర్తి నుంచి నాలుగు వాహనాల్లో ఆహార పదార్థాల తరలింపు
అనపర్తి, సెప్టెంబరు 4: వరద భీభత్సంతో అతలాకుతలమైన విజయవాడ వాసులను ఆదుకోవడం ప్రతిఒక్కరి కర్తవ్యమని స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి వారికి అవసరమైన ఆహారం మంచినీరు అందించాలని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. విజయవాడ వరద బాధితుల కోసం 10వేల మందికి సరిపడా ఆహార పదార్థాలు తరలిస్తున్న వ్యాన్లను అనపర్తి దేవీచౌక్ వద్ద ఆయన జెండా ఊపి వాహనాలను ప్రారంభించారు. అనపర్తి మండలం పొలమూరుకు చెందిన బుద్దవరపు చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో ఐదు వేల మందికి సరిపడా ఆహార పదార్థాలు, బిక్కవోలు మండలం బలభద్రపురంలోని వేంకటేశ్వరస్వామి ఆలయకమిటీ ఆద్వర్యంలో 2500 మందికి ఆహార పదార్దాలు, అనపర్తి వర్తక సంఘం అధ్యక్షుడు కొవ్వూరి వెంకటరా మారెడ్డి ఆధ్వర్యంలో 2500మందికి ఆహార పదార్థాలను తరలించారు. ఈ సందర్బంగా విజయవాడ పయనమైన వాహనాలకు ఎమ్మెల్యే జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కొవ్వూరి శ్రీనివాసరెడ్డి, సత్తి దేవదానరెడ్డి, మల్లిడి శ్రీనివాసరెడ్డి, గొలుగూరి భాస్కరరెడ్డి, కొవ్వూరి పార్వతి తదితరులు పాల్గొన్నారు.
పదివేల వాటర్ బాటిళ్లను పంపించిన వైద్యులు
రాజమహేంద్రవరం సిటీ: విజయవాడ వరద భాదితుల సహాయార్ధం రాజమహేంద్రవరానికి చెందిన గోరంట్ల శాంతారావు మెడికల్ సెంటర్ అధినేత డాక్టర్ రవిరామ్‌కిరణ్ గోరంట్ల ,డాక్టర్ వైఎస్ గురుప్రసాద్‌లు పదివేల వాటర్ బాటిళ్లను పంపించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ ఎప్పుడు చూడని వరదలు విజయవాడను అతలాకుతలం చేశాయని బాధితులను ఆదుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్‌వో ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. లయన్స్‌క్లబ్ కొంతమూరు షణ్ముక క్లబ్ ప్రెసిడెంట్ పామర్తి నాగరాజు, క్లబెమెంటార్, జోన్ చైర్మన్ లయన్ అడుసుమిల్లి బాబు ఆధ్వర్యంలో 10వేల విలువ చేసే ఆహార ప్యాకెట్లను జాయింట్ కలెక్టర్ చిన్నరాముడుకు అందించారు. ఈకార్యక్రమంలో వరదా నాగేశ్వరరావు, భాస్కరాజు, వీర్రాజు, శమంతకమణి, లక్ష్మి, సాయితేజ, ప్రసాద్ పాల్గొన్నారు.
విజయవాడకు ఆహారపొట్లాల తరలింపు
గోకవరం: విజయవాడ వరద బాధితులకు గోకవరం మండలంలోని వివిధ ప్రాంతాల నుంచి ఆహారం, మంచినీళ్లు, తదితర నిత్యావసర వస్తువులను దాతలు వాహనాలపై తరలించారు. బాధితుల కు గోకవరంలోని విశ్వహిందూధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడు కంబాల శ్రీనివాసరావు, కొత్తపల్లి ఆదర్శ ఫార్మశీ విద్యాసంస్ధల అధినేత ప్రగళ్ళపాటి కనకరాజు బాసటగా నిలిచారు. కంబాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సుమారు 5వేల భోజనం పొట్లాలు, కనకరా జు ఆధ్వర్యంలో 1000 ఆహారపొట్లాలను, వాటర్ ఫ్యాకెట్లను బుధవారం వాహనాలపై విజయవాడకు తరలించారు.
బిక్కవోలు ఫిషర్‌మెన్ సొసైటీ ఆధ్వర్యంలో...
బిక్కవోలు: బిక్కవోలు నుంచి విజయవాడ వరద బాధితులకు బిక్కవోలు ఫిషర్‌మెన్ కో-ఆపరేటివ్ సొసైటీవారు బుధవారం ఆహార పొట్లాలు, వాటర్ బాటిళ్లు, బిస్కెట్ ప్యాకెట్లు, పాల ప్యాకెట్లు పంపించారు. అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి సూచనల మేరకు వీటిని పంపుతున్నామని ఫిషర్‌మెన్ సొసైటీ సభ్యులు తెలిపారు.
వరద బాధితులకు భోజనం ప్యాకెట్లు తరలింపు
రంగంపేట: జిల్లా కలెక్టర్ పిలుపు మేరకు తూర్పుగోదావరి జిల్లా రంగంపేట ఇన్‌చార్జ్ తహశీల్దార్ టి.వి.వి.ఎస్.ఎ.శశిధర్ ఆధ్వర్యంలో కార్యాలయం సిబ్బంది, మండలంలో గల వీఆర్వోలు, విలేజ్ సర్వేయర్లు అందరూ కలిసి బుధవారం విజయవాడలోని వరద బాధితులకు 2500 భోజనం ప్యాకెట్లును తీసుకెళుతున్న వాహనానికి ఇన్‌చార్జ్ తహశీల్దార్ జెండా ఊపి పంపించారు. కార్యాలయ సిబ్బంది, విఆర్వోలు, విలేజ్ సర్వేయర్లు పాల్గొన్నారు.
3వ రోజు వరద బాధితుల సేవలో ఎమ్మెల్యే బత్తుల
కోరుకొండ: విజయవాడ సింగ్‌నగర్‌లో చిక్కుకున్న వరద బాధితులను బుధవారం రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ, తన బృందంతో ట్రాక్టర్‌లు, జేసీబీల సహాయంతో వరదలో చిక్కుకున్న బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 4 అడుగుల నీళ్ల లోతులో ఎమ్మెల్యే స్వయంగా నడిచి వెళ్లి బాధితులకు ఆహారం, మంచినీరు, పాలు, బిస్కెట్ ప్యాకెట్లు అందజేశారు. వృద్ధులను, మహిళలను, పిల్లలను ప్రత్యేక వాహనాల్లో సురక్షిత ప్రాంతాలకు తరలించారు.