రైతుల కంట్లో పొగాకు
ABN , Publish Date - Sep 16 , 2024 | 12:25 AM
పొగాకు బంగారం.. ఎందుకంటే ఆరంభంలో ధర అదిరిపోయిం ది..ఎన్నడూ లేనిది రికార్డు స్థాయిలో విక్రయించారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది నెంబర్ వన్ పొగాకుకు ధరలు ఆకాశాన్నంటాయి.అయితే చివరికి లోగ్రేడ్ పొగాకు కొనుగోలు చేసే వారులేక రైతుల ముఖం పొగచూరిపోతుంది.
కొనుగోళ్లకు కంపెనీల నిరాసక్తత
నాడు గ్రేడ్ వన్ కిలో రూ.400
నేడు లోగ్రేడ్ రూ.130-రూ.120
కొనేవారు లేక రైతుల ఆందోళన
కేంద్రాల వద్ద దళారుల రాజకీయం
లబోదిబోమంటున్న రైతాంగం
గోపాలపురం/దేవరపల్లి, సెప్టెంబరు 15 : పొగాకు బంగారం.. ఎందుకంటే ఆరంభంలో ధర అదిరిపోయిం ది..ఎన్నడూ లేనిది రికార్డు స్థాయిలో విక్రయించారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది నెంబర్ వన్ పొగాకుకు ధరలు ఆకాశాన్నంటాయి.అయితే చివరికి లోగ్రేడ్ పొగాకు కొనుగోలు చేసే వారులేక రైతుల ముఖం పొగచూరిపోతుంది. రైతుల పొగాకు బేళ్ళు యార్డుకు తీసుకురావడం..వెనక్కి తీసుకెళ్లడంతో తీవ్ర గందరగో ళానికి గురవుతున్నారు. ఈ ఏడాది అమాంతం పొగాకు కిలో ధర రికార్డు స్థాయిలో రూ.400లకు అమ్ము డు పోయింది.అదే సమయంలో లోగ్రేడ్ పొగాకు మొదటి దశలో రూ.250 నుంచి క్రమంగా రూ.170ల దగ్గర ధర నిలకడగా నిలి చింది.దీంతో ఈ ఏడాది పెట్టుబడిపోనూ నాలుగురాళ్ళు వెనకేసుకుందామని అనుకున్న పొగాకు రైతాం గానికి కొత్త కష్టం వచ్చిపడింది. గ్రేడ్ వన్ పొగా కును కొనుగోలు చేసిన ఆయా కంపెనీల ప్రతినిధులు లోగ్రేడ్ (మాడు) పొగాకును కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపకపోవడంతో రైతుల గుండెల్లో ఇప్పుడే అసలైన గుబులు మొదలైంది.
దళారుల దందా..
ప్రతి రైతుకు ఎకరానికి క్వింటా నుంచి రెండు క్వింటా వరకు లోగ్రేడు(మాడు) తప్పకుండా ఉంటు ంది. వాతావరణం అనుకూలించకపోయినా సాగులో తేడా వచ్చినా ఈ లో గ్రేడు పొగాకు మరింత అద నం గా పెరుగుతుంది.మేలురకం పొగాకు ధరలు అదనంగా ఉండడంతో కొందరు దళారులు లోగ్రేడ్ ధరలు బాగానే ఉంటాయని ఊహించి ఇప్పటికే పెద్దమొత్తంలో కొను గోలు చేసి డబ్బు చేసినట్టు సమాచారం. వేలం కేం ద్రంలో నిర్థేశించిన పొగాకు కన్నా అదనంగా పొగా కు ఉంటుందనే అంచనాలతో బయ్యర్లు, దళారులు కుమ్మ క్కయి రైతు పొగాకును కొనుగోలు చేయడంలేదు. రెం డు మూడు వారాలు రైతు వద్ద పొగాకు కొనుగోలు చేయకపోతే విసుగుచెందిన రైతులుపొగాకును బోర్డుకు తీసుకురావడం మానేస్తారని..ఆ సమయంలో దళా రు ల వద్ద ఉన్న పొగాకును కొనుగోలు చేసి అధిక ధర ఇచ్చేందుకు దళారులు ఆయా కొనుగోలుదారులు కుమ్మ క్కవుతున్నారనే ఆరోపణలున్నాయి. ఇంత జరుగుతున్న బోర్డు అధికారులు మీనమేషాలు లెక్కవేస్తున్నారు.
ఇప్పుడేం చేయాలి..?
పొగాకు సాగు వచ్చే ఏడాదికి ప్రారంభించాల్సిన సమయం ఆసన్నమైనా గతేడాది పండించిన పొగాకు అమ్మకాలు పూర్తికాకపోవడంపై రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.వర్జీనియా పొగాకు సాగులో పంట కాలం కంటే పండిన పంటను అమ్మడానికే ఎక్కువ సమయం పడుతుందని రైతులు భావిస్తున్నారు. ఆరు గాలం పండించిన పంట అమ్ముకో వడానికి ఆంక్షల మధ్య పొగాకు రైతాంగం కొట్టుమిట్టా డు తుంది.వచ్చే ఏడాది పొగాకు నాట్లుకు సంబంధించి నారు మ డులు పెంపకంలో రైతులు బిజీబిజీగా గడిపే సమయంలో సెప్టెంబరు మాసం వచ్చినా ఇప్పటికి పొగాకు కొను గోళ్ల ప్ర క్రియ పూర్తి కాలేదు.దీంతో ఈ ఏడాది పంట కొనుగోలు పూర్తికాక వచ్చే ఏడాది పంటకు సన్నద్ధం కాలేక రైతులు ఇక్కట్లు పడుతున్నారు.తదుపరి పంట సాగుకు సన్నద్దం కాక ముందే కొనుగోళ్లు పూర్తిచే యాలని రైతులు భావిస్తున్నారు.
పడిపోయిన పొగాకు ధర
నిన్న మొన్నటి వరకు గరిష్ట ఽస్థాయిలో ధర పలికిన వర్జీనీయ పొగాకు చివరి దశలో ధర పతనమై కొనుగోలు చతికల బడ్డాయి. దీంతో లోగ్రేడ్ పొగాకు కొనుగోళ్లు నత్తనడకన సాగుతున్నాయి. ఈ ఏడాది గ్రేడ్‌వన్ పొగాకు ధర రికార్డు స్థాయిలో రూ.400 ధర పలికింది. దీంతో రైతులు గ్రేడ్ వన్ పొగాకు విక్రయా లు మొదటి దశలో జరిపారు. పొగాకు కొనుగోళ్లు చివరి దశకు రావడంతో లోగేడ్ర్ పొగాకును కొనుగోలు చేయ డానికి ఆయా కంపెనీల ప్రతినిధులు వెనక డుగు వేస్తున్నారు. దీంతో వేలం కేంద్రం వద్ద లోగ్రేడ్ బేళ్ళు గుట్టలుగుట్టలుగా ఉన్నా యి.శనివారం గోపాలపురంలో లోగ్రేడ్ పొగాకును కని ష్టంగా రూ.130 రూపాయలకు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపకపోవడంతో రైతులు అమ్మకాలు నిలిపి వేశారు.వేలం కేంద్రానికి శనివా రం 800 లోగ్రేడ్ పొగాకు బేళ్ళు అమ్మకానికి వచ్చి కొనుగోలు జరపక పోవడంతో ప్లాట్‌ఫామ్ పై గుట్టులు గుట్టలుగా పడి ఉన్నాయి. దేవరపల్లి పొగాకు వేలం కేంద్రం పరిధిలో లోగ్రేడ్ పొగాకు రూ.120లకు ధర పడిపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పొగాకు కం పెనీల మధ్య పోటీ లేక ఒకటి రెడు కంపెనీలే పాల్గొనడంతో ధర రూ.120కే పరిమితం చేశారు. రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.