Share News

సాఫ్ట్‌బాల్‌ విజేత విజయనగరం జిల్లా జట్టు

ABN , Publish Date - Dec 01 , 2024 | 12:16 AM

కాకినాడ రూరల్‌ నవంబరు 30(ఆంధ్రజ్యోతి): గత మూడురోజులుగా కాకినాడ జిల్లా క్రీడా మైదానంలో జరుగుతున్న అండర్‌-17 బాలికల రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్‌ పోటీలు శనివారం ముగిసినట్టు ఎస్జీఎఫ్‌ జిల్లా కార్యదర్శి ఎల్‌.జార్జ్‌ తెలిపారు. విజయనగరం జిల్లా జట్టు విజేతగా నిలవగా ఉమ్మడి తూర్పుగోదా

సాఫ్ట్‌బాల్‌ విజేత విజయనగరం జిల్లా జట్టు
ట్రోఫీతో సాఫ్ట్‌బాల్‌ విజేత విజయనగరం జిల్లా బాలికల జట్టు

ద్వితీయ స్థానంలో నిలిచిన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా బాలికల జట్టు

ముగిసిన రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్‌ పోటీలు

కాకినాడ రూరల్‌ నవంబరు 30(ఆంధ్రజ్యోతి): గత మూడురోజులుగా కాకినాడ జిల్లా క్రీడా మైదానంలో జరుగుతున్న అండర్‌-17 బాలికల రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్‌ పోటీలు శనివారం ముగిసినట్టు ఎస్జీఎఫ్‌ జిల్లా కార్యదర్శి ఎల్‌.జార్జ్‌ తెలిపారు. విజయనగరం జిల్లా జట్టు విజేతగా నిలవగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా బాలికల జట్టు ద్వితీయ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చిం ది. తృతీయస్థానంలో కడప జిల్లా జట్టు నిలిచింది. ఈ జట్ల నుంచి ఉత్తమ జట్టును ఎంపిక చేస్తారు. అలా ఎంపికైన జట్టు మహారాష్ట్రలో జనవరిలో జరిగే జాతీయస్థాయి సాఫ్ట్‌బాల్‌ పోటీలలో పాల్గొంటుంది. ఈ సందర్భంగా బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమంలో జేఎన్టీయూకే స్పోర్ట్స్‌ కౌన్సిల్‌ కార్యదర్శి డాక్టర్‌ జి.శ్యామ్‌కుమార్‌, డీఎస్‌డీవో శ్రీనివాస్‌కుమార్‌, పీఈటీ సంఘ అధ్యక్ష,కార్యదర్శులు రవిరాజు,నూకరాజు చేతులమీదుగా విజేతలకు ట్రోఫీలను, పతకాలను అందజేశారు.

Updated Date - Dec 01 , 2024 | 12:16 AM