Share News

పట్టపగలు చోరీకి ప్రయత్నం.. దొంగకు దేహశుద్ధి

ABN , Publish Date - Feb 13 , 2024 | 01:02 AM

గొల్లప్రోలు రూరల్‌, ఫిబ్రవరి 12: కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం చేబ్రోలులో పట్టపగలు చోరీకి ప్రయత్నించిన వ్యక్తిని స్థానికులు పట్టుకున్నారు. ఆ వ్యక్తి తిరగబడటానికి ప్రయత్నించడంతో దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. గ్రామంలోని ఈబీసీ కాలనీ వద్ద గల మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాల వద్ద నివాసముంటున్న బొమ్మిడాల కామేశ్వరరావు తన ఇంటికి తాళం వేసుకుని బయటకు వెళ్లారు. ఆ సమయంలో ఒక వ్యక్తి ఇంటి తాళాలు, తలుపుల

పట్టపగలు చోరీకి ప్రయత్నం.. దొంగకు దేహశుద్ధి

గొల్లప్రోలు రూరల్‌, ఫిబ్రవరి 12: కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం చేబ్రోలులో పట్టపగలు చోరీకి ప్రయత్నించిన వ్యక్తిని స్థానికులు పట్టుకున్నారు. ఆ వ్యక్తి తిరగబడటానికి ప్రయత్నించడంతో దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. గ్రామంలోని ఈబీసీ కాలనీ వద్ద గల మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాల వద్ద నివాసముంటున్న బొమ్మిడాల కామేశ్వరరావు తన ఇంటికి తాళం వేసుకుని బయటకు వెళ్లారు. ఆ సమయంలో ఒక వ్యక్తి ఇంటి తాళాలు, తలుపులను బద్దలు కొట్టేందుకు ప్రయత్నించాడు. ఇది గమనించిన పక్కింటి వారు పట్టుకోవడానికి ప్రయత్నించగా హరేరామ గుడి వరకూ పరారయ్యాడు. అక్కడ స్థానికులు పట్టుకోగా వారిపై తిరగబడ్డాడు. దీంతో స్థానికులు అతనికి దేహశుద్ధి చేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. గొల్లప్రోలు పోలీసులు సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.

Updated Date - Feb 13 , 2024 | 01:02 AM