Share News

రూ.6 లక్షలు నొక్కేసి.. 25 మందిని వదిలేశారు?

ABN , Publish Date - Oct 02 , 2024 | 12:32 AM

జూద శిబిరానికి వెళ్లారు.. పేకాట ఆడుతున్న వాళ్లను చప్పున పట్టేశారు.. చట్ట ప్రకారం నడుచుకుంటే జేబు నిండు తుందా?అని ఎప్పటి మాదిరిగానే అనుకున్నారు.. చట్టా లను బ్రేక్‌ చేశారు.. కొంత వెనక్కి ఇచ్చేశారు.. మరి కొంత నొక్కేశారు..

రూ.6 లక్షలు నొక్కేసి.. 25 మందిని వదిలేశారు?

రంగంలోకి ఎస్పీ..

డీఎస్పీ రహస్య విచారణ

రాజమహేంద్రవరం, అక్టోబరు 1(ఆంధ్రజ్యోతి): జూద శిబిరానికి వెళ్లారు.. పేకాట ఆడుతున్న వాళ్లను చప్పున పట్టేశారు.. చట్ట ప్రకారం నడుచుకుంటే జేబు నిండు తుందా?అని ఎప్పటి మాదిరిగానే అనుకున్నారు.. చట్టా లను బ్రేక్‌ చేశారు.. కొంత వెనక్కి ఇచ్చేశారు.. మరి కొంత నొక్కేశారు.. వడ్డించుకోవడంలో తేడాలు రావడం తో ఆ ఖాకీల బాగోతం జిల్లా పోలీస్‌ బాస్‌ చెవిలో పడిం ది. దీంతో ఎస్పీ నరసింహ కిషోర్‌ రహస్య విచారణకు ఆదేశించారు. గత నెల 8న జరిగిన ఈ కథను ఆరాతీస్తే.. పెరవలి మండలం ముక్కామల గ్రామ పరిధి పశ్చిమ, తూర్పుగోదావరి సరిహద్దులో పేకాట శిబిరం నిర్వహిస్తు న్నారని పోలీసులకు సమాచారం అందింది. పెరవలి ఎస్‌ఐ ముగ్గురు సిబ్బందితో కలిసి వెళ్లి శిబిరంపై దాడి చేశారు.సుమారు 30 మందిని అదుపులోకి తీసుకున్నారు. వాళ్ల వద్ద ఉన్న దాదాపు రూ.8 లక్షలు స్వాధీనం చేసుకు న్నారు. కాస్త హడావుడి అనంతరం బేరం కుదిరింది. రూ.50 వేలు కేసులో చూపించారు.జూదరులకు రూ.1.50 లక్షలు తిరిగిచ్చేశారు. మిగతా రూ.6 లక్షలు యూనిఫాం లో తోసేశారు.30 మంది పట్టుబడితే ఒప్పందం ప్రకారం ఐదారుగురిని కేసులో చూపించారు. ఎందుకంటే వీరిలో పలువురు వైసీపీ నాయకులు ఉన్నట్టు సమాచారం. వాటాల పంపకాల్లో తేడాలు రావడంతో నిఘా విభా గానికి ఉప్పందింది.సీరియస్‌గా తీసుకున్న ఎస్పీ అంత ర్గత విచారణకు ఆదేశించారని సమాచారం. దీంతో గత మూడు రోజులుగా ఆ రోజు పోలీసులు దాడి చేసిన ప్పుడు దొరికిన నిందితులు అందరినీ విడతల వారీగా రప్పించి కొవ్వూరు డీఎస్పీ దేవకుమార్‌ రహస్యంగా విచారణ చేస్తున్నారు.ఆ రోజు తమ దగ్గర డబ్బులు నొక్కేసి, కేసు నుంచి తప్పించిన విషయం వాస్తవమేనని నిందితులు ఒప్పుకున్నట్టు తెలుస్తోంది. నిడదవోలు సీఐకి మొత్తం తతంగం తెలుసని పెరవలి ఎస్‌ఐ చెబుతుంటే.. తనకు ఏమీ తెలియదని సీఐ అంటున్నారని చెబుతున్నా రు. ప్రజాప్రతినిధుల సహాయంతో బయట పడే పనిని ఎస్సై, సీఐ మొదుల పెట్టారని సమాచారం.

Updated Date - Oct 02 , 2024 | 12:32 AM