Share News

పిడుగుపాటుకు 8 మందికి అస్వస్థత

ABN , Publish Date - Oct 20 , 2024 | 01:06 AM

పిడుగుపాటుకు గురై 8 మంది వ్యవసాయ కూలీలు అస్వస్థతకు గురయిన సంఘటన కొవ్వూరు మం డలం పెనకనమెట్ట గ్రామంలో జరిగింది. శనివారం మధ్యాహ్నం కురిసిన వర్షానికి పెనకనమెట్ట గ్రా మంలో పిడుగు పడింది.

పిడుగుపాటుకు 8 మందికి అస్వస్థత
బాధితులను పరామర్శిస్తున్న ఎమ్మెల్యే ముప్పిడి, ద్విసభ్య కమిటీ

  • కొవ్వూరు ప్రభుత్వాసుపత్రికి తరలింపు

  • బాధితులకు ఎమ్మెల్యే పరామర్శ

  • పెనకనమెట్టలో ఘటన

కొవ్వూరు, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి): పిడుగుపాటుకు గురై 8 మంది వ్యవసాయ కూలీలు అస్వస్థతకు గురయిన సంఘటన కొవ్వూరు మం డలం పెనకనమెట్ట గ్రామంలో జరిగింది. శనివారం మధ్యాహ్నం కురిసిన వర్షానికి పెనకనమెట్ట గ్రా మంలో పిడుగు పడింది. వర్షం కురుస్తుండడంతో చెట్టు కింద నిల్చున్న వ్యవసాయ కూలీలు సిర్రా ఉత్తె మ్మ, చాపల కౌసల్య, బండి నాగమణి, కొక్కిరిపాటి సుజా త, పసలపూడి గన్నెమ్మ, కొక్కిరిపాటి లక్ష్మి, కాట్రు నారాయణమ్మ, కడియం రా ణిలు పిడుగుపాటుతో ఒక్క సారిగా శబ్ధం రావడంతో షాక్‌కు గురయ్యారు. అస్వస్థతకు గురయిన ఎనిమిది మందినీ కొవ్వూ రు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కూలీలను ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు, ద్విసభ్య కమిటీ సభ్యు లు కంటమణి రామకృష్ణారావు, మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ సూరపనేని చిన్ని, టీడీపీ పట్టణ అధ్యక్షులు దాయన రామకృష్ణ, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పరిమి రాధాకృష్ణ, కౌన్సిలర్‌ పిల్లలమర్రి మరళీకృష్ణ, బోడపాటి ముత్యాలరావు పరామర్శించారు. ఎమ్మెల్యే ముప్పిడి.. ఆర్డీవో, తహశీల్దార్లకు సమాచారం చేరవేశారు. ప్రభుత్వ పరంగా హకారం అందించాలని సూచించారు. సమాచారం తెలుసుకున్న తహశీల్దార్‌ ఎం.దుర్గాప్రసాద్‌ ఆసు పత్రికి చేరుకుని బాధితులను పరామర్శించారు. కార్యక్రమంలో వరిగేటి కాంతరాజు, కొక్కిరిపాటి శ్రీహరి. పసలపూడి హరిబాబు పాల్గొన్నారు.

Updated Date - Oct 20 , 2024 | 01:06 AM