Share News

తొలిరోజే 98.43

ABN , Publish Date - Oct 02 , 2024 | 12:28 AM

ఓ విజన్‌.. ఓ పద్ధతి.. ఓ ప్రణాళిక.. ఈ విధానమే కూటమి ప్రభుత్వం వచ్చాక ఒకటో తేదీన ఠంచనుగా పింఛను చేతికందిస్తోంది..

తొలిరోజే 98.43
విజ్జేశ్వరంలో పింఛను అందజేస్తున్న మంత్రి దుర్గేష్‌

రాష్ట్రంలో రెండో స్థానం

సచివాలయ సిబ్బంది పట్టుదల

ఉదయం 5 నుంచే ఆరంభం

రాత్రి 8 గంటల వరకూ పంపిణీ

ఇంటింటికీ వెళ్లి అందజేత

కోలమూరు సర్వేయర్‌ చేతివాటం

సస్పెండ్‌ చేస్తూ కలెక్టర్‌ ఉత్తర్వులు

రాజమహేంద్రవరం, అక్టోబరు 1 (ఆంధ్రజ్యోతి) : ఓ విజన్‌.. ఓ పద్ధతి.. ఓ ప్రణాళిక.. ఈ విధానమే కూటమి ప్రభుత్వం వచ్చాక ఒకటో తేదీన ఠంచనుగా పింఛను చేతికందిస్తోంది.. చంద్రబాబు అధికారంలోకి వస్తే ఎలా ఉంటుందో పింఛను నుంచే చేసి చూపిస్తున్నారు. వలంటీర్లు లేకపోయినా తొలి రోజునే ఏకంగా 98 శాతానికి పైగా లబ్ధిదారులకు అందజేసి రికార్డు సృష్టిస్తున్నారు. ఈ నెల కూడా మంగళవారం తెల్లవారుజాము నుంచే పింఛన్ల పంపిణీ ప్రారంభించారు.మంగళవారం ఉదయం 5.30 గంటలకు యాప్‌ ఓపెన్‌ అయ్యింది. ఆ మరుక్షణమే 4,896 మంది సిబ్బంది లబ్ధిదారుల ఇళ్లకు చేరుకొని రూ.4 వేల పింఛను సొమ్మును చేతి లో పెట్టారు. ఉదయం 8 గంటలకే 78ు పింఛన్లు పూర్త య్యాయి. దీంతో తూర్పుగోదావరి జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలోకి చేరింది.తర్వాత 12 గంటలకు 95 శాతం, సాయంత్రం 7 గంటలకు 98.37 శాతం పింఛన్ల పంపిణీ పూర్తయింది. అంటే సుమారు 14 గంటల్లో జిల్లాలో మొత్తం 2,39,021 పింఛను లబ్ధిదారులు ఉండగా సాయంత్రం 7 గంటల సమయానికి 2,35,123 మందికి పింఛన్లు అందజేశారు. రాత్రి 8 గంటలకు 98.43 శాతం పింఛన్లు అందజేశారు.రాష్ట్రంలో ద్వితీయ స్థానంలో నిలిచారు. వివిధ కారణాలతో ఇళ్ల వద్ద లేకపోయిన వాళ్లు మిన హా దాదాపుగా అందరు లబ్ధిదారులు పింఛను అందుకొన్నారు.

71 బ్రాంచిలు.. రూ.101 కోట్లు డ్రా

జగన్‌ ప్రభుత్వంలో పింఛన్ల పంపిణీ పెద్ద క్రతువులా వారం రోజులు సాగేది. అయితే కూటమి ఓ పద్ధతి ప్రకారం పింఛన్ల పంపిణీ చేస్తుండడంతో అటు లబ్ధిదారులు, ఇటు ఉద్యోగుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. జిల్లా కలెక్టర్‌ ప్రశాంతి పక్కా ప్లానింగ్‌ చేస్తున్నారు. డీఆర్‌డీఏ పీడీ సమన్వయం చేసుకుంటున్నారు. పింఛన్ల పంపిణీకి ముందు రోజున లబ్ధిదారులకు ఓ మెసేజ్‌ పంపిస్తున్నారు. రేపు ఉదయం ఇంటికి వచ్చి పింఛను అంద జేస్తాం.. అందుబాటులో ఉండాలని దాని సారంశం. మరోవైపు డబ్బులు బ్యాంకుల నుంచి డ్రా చేసి సిబ్బందికి అందజేసే ప్రక్రియ జరుగుతోంది. ఈ నెలకు సంబంధించి మొత్తం 71 బ్యాంకు బ్రాంచిల్లో రూ.101 కోట్లను సోమవారం సాయంత్రమే డ్రా చేశారు. వాటిని సిబ్బందికి పంపిణీ చేశారు. దీంతో మంగళవారం తెల్లవారుజామున యాప్‌ ఓపెన్‌ కాగానే అప్పటికే సిద్ధంగా ఉన్న సిబ్బంది పింఛన్ల పంపిణీని మొదలు పెట్టారు.

కోలమూరులో సర్వేయర్‌ చేతివాటం

రాజమహేంద్రవరం రూరల్‌, అక్టోబ రు 1 : రాజమహేంద్రవరం రూరల్‌ మండలం కోలమూరు సచివాలయం-2 లో సర్వేయర్‌ కె.వెంకటాచారి చేతివాటం ప్రదర్శించి సస్పె న్షన్‌కు గురయ్యారు.ఎన్టీఆర్‌ భరోసా పిం ఛన్ల పంపిణీలో భాగంగా లబ్ధిదారులకు చెల్లించాల్సిన రూ.4 వేలలో రూ.300 తగ్గిం చి పంపిణీ చేస్తున్నాడు.ఇదేంటని లబ్ధిదారులు ప్రశ్నించగా కొం దరి వద్ద దసరా మామూళ్లు అని మరికొందరి వద్ద వరద బాధి తులకు పంపాలంటూ పొంతన లేని కారణాలు చెప్పడంతో లబ్ధిదారులు పంచాయతీ కార్యదర్శితో పాటు టీడీపీ నాయకులకు సమాచారం అందిం చారు.ఈ మేరకు లబ్ధిదారులు సమక్షంలో వెంకటాచారిని విచారి ంచి రూ.300 ఇప్పించామని కార్యదర్శి విజయ్‌రెడ్డి తెలిపారు. 18 మంది లబ్ధిదారులకు రూ.300 తక్కువ ఇచ్చినట్టు గుర్తించామ న్నారు. దీనిపై తగు చర్యలు నిమిత్తం రూరల్‌ ఎంపీడీవోకు నివే దిక పంపించారు.ఈ మేరకు సమా చారం అందడంతో కలెక్టర్‌ ప్రశాంతి వెంటనే సస్పెన్షన్‌ చేశారు.

అర్హులందరికీ పింఛన్లు : దుర్గేష్‌

నిడదవోలు, అక్టోబరు 1 : కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీకి కట్టుబడి జిల్లా వ్యాప్తంగా 2,39,021 మందికి రూ.101.95 కోట్లు సామాజిక భద్రత పింఛన్లు ఇంటి వద్దనే పంపిణీ చేస్తున్నామని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్‌ అన్నారు. నిడదవోలు మండలం విజ్జేశ్వరం గ్రామంలో మంగళవారం ఎన్టీఆర్‌ భరోసా పింఛను పంపిణీ చేసి మాట్లాడా రు. అర్హులైన ప్రతి ఒక్కరికి పింఛన్లు అందిస్తున్నామన్నారు. విజ్జేశ్వరం గ్రామానికి చెందిన బ్రెయిన్‌ ఆపరేషన్‌ జరిగిన పేషెంట్‌ సత్యనారాయణకు రూ.15 వేలు పెన్షన్‌ అందించారు.

Updated Date - Oct 02 , 2024 | 12:28 AM